కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం రెడీ-టు-ఈట్-మీల్స్.. సన్నాహాలు చేస్తున్న ఐఆర్‏సీటీసీ..

ఇక నుంచి రైళ్లలో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఐఆర్‏సీటీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు ప్రయాణీకులకు….

  • Rajitha Chanti
  • Publish Date - 10:08 pm, Tue, 19 January 21
కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం రెడీ-టు-ఈట్-మీల్స్.. సన్నాహాలు చేస్తున్న ఐఆర్‏సీటీసీ..

New service on trains: ఇక నుంచి రైళ్లలో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఐఆర్‏సీటీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు ప్రయాణీకులకు రెడీ టు ఈట్ మీల్స్ అందించేందుకు ప్రయాత్నాలు చేస్తోంది. ఇప్పటి ఇందుకు సంబంధించి ప్రముఖ ఆహార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక రెడీ టు మీల్స్ ప్రాజెక్ట్ కోసం హల్దీరామ్స్, ఐటీసీ, ఎంటీఆర్, వాఘ్‏బక్రి వంటి ఆహార సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తోంది. తొందర్లోనే దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ సేవలను తొందర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ఐఆర్‏సీటీసీ కరోనాతో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని సరిచేయడానికి కేంద్రం యోచిస్తోంది. అలాగే ప్రయాణికులను ఆకర్షించే విధంగా ఆహారాన్ని అందించేందుకు కసరత్తులు చేస్తోంది. దీంతో రైల్వేలో ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ కొత్త ప్రాజెక్ట్ అమలు చేయానున్నట్లుగా తెలుస్తోంది. విమానాల్లో ఈ రెడీ టు ఈట్ మీల్ విధానం అమలవుతుండగా.. ఈ సేవతో విమానయాన సంస్థలు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇక ఇదే విధానాన్ని రైల్వేలో కూడా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Also Read:

ఆసుపత్రిలో చేరిన ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. ఆ సినిమా షూటింగ్‏లో ఉండగానే.. అసలు కారణం ఏంటంటే ?

టాలీవుడ్‏లో దూసుకుపోతున్న ‘క్రాక్’ విలన్.. మోస్ట్ వాంటెడ్ యాక్టర్‏గా మారిన సముద్రఖని..