Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణెలలో ప్రారంభమైన కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణె నగరాల్లో మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. అయితే రద్దీ తక్కువగానే ఉందని, క్రమ క్రమంగా..

Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణెలలో ప్రారంభమైన కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ
Follow us

|

Updated on: Jan 19, 2021 | 3:47 PM

Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణె నగరాల్లో మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. అయితే రద్దీ తక్కువగానే ఉందని, క్రమ క్రమంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ముంబైలో 9 కేంద్రాలు, పుణె జిల్లాలోని 28 కేంద్రాల్లో టీకా డ్రైవ్‌ తిరిగి ప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు. టీకా రిజిస్ట్రేషన్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన కోవి-విన్‌ యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆది, సోమవారాల్లో టీకాలు వేసే కార్యక్రమం నిలిపివేసింది.

మొదటి రోజు శనివారం నాలుగు వేల మందికి కేవలం 1923 మంది మాత్రమే మొదటి డోసు వేసినట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (బీఎంసీ) తెలిపింది. మంగళవారం ముంబైలోని అన్ని కేంద్రాల్లో ఉదయం నుంచి ఈ టీకా కార్యక్రమం ప్రారంభమైంది.

వ్యాక్సిన్‌ పంపిణీ మొదలైనా రిజిష్టర్‌ చేసుకున్న వారు రావడం లేదని, కేఈఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌ ఉదయం పదిన్నర గంటల వరకు కూడా ఖాళీగానే కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇక పుణెలోని 31 కేంద్రాల్లో 28 చోట్ల టీకాలు వేయడం ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యలతో మూడు చోట్ల టీకాలు వేయడం సాధ్యం కాదని పుణె మున్సిపల్‌ కార్పోరేషన్‌ హెల్త్‌ చీఫ్‌ డాక్టర్‌ ఆశీష్‌ భారతి తెలిపారు. టీకా పంపిణీ చేసిన తొలి రోజు శనివారం 3,100 మందికి గానూ 1802 లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సుమారు 300 మంది పలు ఆరోగ్య సమస్యలపై ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు.

Also : Corona Vaccination: తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..