Delhi: వీడు మనిషా.. మృగమా..? 16 ఏళ్ల అమ్మాయిని.. 21 సార్లు కత్తితో పొడిచి.. పొడిచి..

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. నడిరోడ్డు మీద 16 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. అందరూ చూస్తుండగానే కత్తితో అదే పనిగా పొడిచి చంపాడు ప్రియుడు సాహిల్‌. తరువాత పలుమార్లు బండరాయితో మోదాడు.

Delhi: వీడు మనిషా.. మృగమా..? 16 ఏళ్ల అమ్మాయిని.. 21 సార్లు కత్తితో పొడిచి.. పొడిచి..
Delhi Girl Murder
Follow us
Ram Naramaneni

|

Updated on: May 29, 2023 | 3:28 PM

దేశరాజధాని ఢిల్లీలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. నడిరోడ్డు మీద 16 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు బాయ్‌ఫ్రెండ్‌… అందరూ చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో పొడిచిచంపాడు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు .. 21 సార్లు కత్తితో ఆ అమ్మాయిని పొడిచాడు. అంతేకాదు కాసేపటి తరువాత మళ్లీ అక్కడికి వచ్చి ఆమెపై బండరాయి ఎత్తేశాడు. ఏళ్ల పగ ఉన్న శత్రువు మాదిరి.. ఆమెపై బరువైన బండరాయిని పలుసార్లు విసిరికొట్టాడు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఉన్న షాబాద్‌ డెయిరీ దగ్గర ఈ దారుణం జరిగింది.

16 ఏళ్ల సాక్షి హత్య ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. బాయ్‌ఫ్రెండ్‌ పేరు సాహిల్‌. ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు స్థానికులు వెల్లడించారు. గత అర్ధరాత్రి తన ఫ్రెండ్‌ బర్త్‌డే వెళ్లుండగా సాక్షితో సాహిల్‌కు తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో సాక్షిని పొడిచి చంపాడు సాహిల్‌. మర్డర్‌ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఢిల్లీలో శాంతిభద్రతలు లోపించాయని ఆరోపించారు సీఎం కేజ్రీవాల్‌. పోలీసు వ్యవస్థ ఎల్జీ కింద పనిచేస్తుందన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే సాక్షి మర్డర్‌ జరిగిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులకు నోటీసులు జారీ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిమాలివాల్‌.

పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తునట్టు ప్రకటించారు. అయితే చాలామంది రోడ్డుపై వెళ్తుండగానే ఈ మర్డర్‌ జరిగింది. 20 ఏళ్ల సాహిల్‌ ఈ హత్య చేశాడని , మర్డర్‌ ఎందుకు చేశాడన్న విషయంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలోనే సాహిల్‌ను పట్టుకుంటాని పోలీసులు వెల్లడించారు. సాహిల్‌ కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సాహిల్‌కు నేరచరిత్ర ఉందా ? అన్నవిషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..