RBI Recruitment 2023: బ్యాంక్‌ జాబ్స్..రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తులు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో.. లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, లైబ్రరీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

RBI Recruitment 2023: బ్యాంక్‌ జాబ్స్..రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు ప్రారంభమైన దరఖాస్తులు..
Reserve Bank of India
Follow us

|

Updated on: May 29, 2023 | 2:39 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో.. లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, లైబ్రరీ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 23వ తేదీన ఉంటుంది. ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.