TATA Recruitment: ఏడాదికి రూ. 7 లక్షల జీతంతో ఉద్యోగాలు.. టాటా స్టీల్‌లో ఇంజనీరింగ్ పోస్టులు.

టాటా స్టీల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. టాటా స్టీల్‌ అస్పైరింగ్ ఇంజనీర్స్‌ ప్రోగ్రామ్‌ 2023 పేరుతో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.?

TATA Recruitment: ఏడాదికి రూ. 7 లక్షల జీతంతో ఉద్యోగాలు.. టాటా స్టీల్‌లో ఇంజనీరింగ్ పోస్టులు.
Tata Steel Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 29, 2023 | 7:23 PM

టాటా స్టీల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. టాటా స్టీల్‌ అస్పైరింగ్ ఇంజనీర్స్‌ ప్రోగ్రామ్‌ 2023 పేరుతో ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి.

* సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్‌, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఎంటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-06-2023 వరకు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు తొలుత ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణ అందిస్తారు. అనంతరం ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 30,0000 స్టైపెండ్‌, ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 11-06-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!