Madhya Pradesh: వామ్మో ఏంటి ఈ దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగుర్ని చంపిన మరో కుటుంబం
మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మోరేనా జిల్లా లేపా గ్రామంలో ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాలు నివసిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని మోరేనా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం వల్ల రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మోరేనా జిల్లా లేపా గ్రామంలో ధీర్ సింగ్ తోమర్, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే 2013లో వ్యర్థపదార్థాలు డంపింగ్ చేసే విషయంలో ఈ రెండు కుటంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవలో ధీర్ సింగ్ తోమార్ కుటుంబానికి ఇద్దరు చనిపోవడంతో.. గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం ఆ గ్రామం నుంచి పారిపోయింది. ఆ తర్వాత కోర్టులో ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకున్నాయి. శుక్రవారం రోజున గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం మళ్లీ ఆ గ్రామానికి తిరిగివచ్చింది.
అయితే గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబంపై ఉన్న ప్రతికారంతో ధీర్ సింగ్ కుటుంబ సభ్యలు వాళ్లపై కర్రలతో దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో గజేంద్ర సింగ్ తోమర్, అతని ఇద్దరు కొడుకులతో పాటు ఆ కుటుంబంలోని మరో ముగ్గురు మహిళలు చనిపోయారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా బుల్లెట్ గాయాలతో ప్రాణాలు విడిచారు. ఇలా మొత్తం ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 8 మంది నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉన్న భూవివాదం శత్రుత్వంతోనే ఇరు కుటుంబాలు దాడులు చేసుకున్నాయని తెలిపారు.




एमपी के मुरैना में पुरानी रंजिश को लेकर किया प्राणघातक हमला, एक ही परिवार के पिता-पुत्र सहित छह की मौत तीन महिलाओं सहित चार लोग हुए गंभीर घायल, गाँव में पहुँचा पुलिस बल, प्रत्यक्षदर्शियों ने बनाया वीडियो घटना के बाद हुआ वायरल @ABPNews @vivekbajpai84 pic.twitter.com/v55YI5pRZV
— Brajesh Rajput (@brajeshabpnews) May 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




