AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బయటపడ్డ 2 వేల సంవత్సరాల క్రితం నాటి ఆధునిక సమాజం అవశేషాలు.. ఆర్కియాలిజిస్టులు షాక్

మధ్యప్రదేశ్‌లోని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం నాటి అవశేషాలు బయటపడ్డాయి. బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కను వ్యాపార, వాణిజ్య మార్గంగా ఉపయోగించుకున్నట్లు తాజా ఆర్కియలాజికల్ సర్వేలో వెల్లడైంది. ఆనాటి ఆధునిక సమాజం అవశేషలు కనిపించడంతో అర్కియలాజిస్టులు ఆశ్చర్యపోయారు. సుమారు 1500 ఏళ్ల క్రితం నాటి శిల్పం, 2000 ఏళ్ల నాటి మానవులు నిర్మించిన చెరువు ను గుర్తించారు.

బయటపడ్డ 2 వేల సంవత్సరాల క్రితం నాటి ఆధునిక సమాజం అవశేషాలు..  ఆర్కియాలిజిస్టులు షాక్
Bandhavgarh National Park
Aravind B
|

Updated on: May 05, 2023 | 5:55 PM

Share

మధ్యప్రదేశ్‌లోని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం నాటి అవశేషాలు బయటపడ్డాయి. బాంధవ్‌గఢ్ నేషనల్ పార్కను వ్యాపార, వాణిజ్య మార్గంగా ఉపయోగించుకున్నట్లు తాజా ఆర్కియలాజికల్ సర్వేలో వెల్లడైంది. ఆనాటి ఆధునిక సమాజం అవశేషలు కనిపించడంతో అర్కియలాజిస్టులు ఆశ్చర్యపోయారు. సుమారు 1500 ఏళ్ల క్రితం నాటి శిల్పం, 2000 ఏళ్ల నాటి మానవులు నిర్మించిన చెరువు ను గుర్తించారు. బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్‌ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాల్లో వేల సంవత్సరాల క్రితమే ఆధునికతకు సాక్ష్యాధారాలు కనిపించాయని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ శివకాంత్ బాజ్‌పాయి తెలిపారు.

ఇక్కడ ఎత్తయిన ప్రదేశంలో చెరువులు కనిపించాయని, వర్షపు నీటిని ఈ చెరువుల్లో భద్రపరిచినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. దీన్నిబట్టి అప్పట్లోనే ఆధునిక సమాజం ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. దాదాపు 1,800 నుంచి 2,000 సంవత్సరాల క్రితం ఈ చెరువులను నిర్మించి ఉండవచ్చని తెలిపారు. సుమారు 1,000 సంవత్సరాల క్రితం వీటికి మరమ్మతులు జరిగినట్లు కూడా సాక్ష్యాలు ఉన్నట్లు వివరించారు. ఆ కాలంలో వ్యాపారస్థులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఉపయోగించిన గుహల వంటి ప్రదేశాలు కూడా కనిపించాయని తెలిపారు. ఓ గుహలో స్వర్ణ యుగం నాటి చిత్రాలు కూడా కనిపించాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..