Manipur Violence: మణిపుర్ అల్లర్ల వెనుక ఆ దేశ హస్తం ఉంది.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
మణిపుర్‌లో అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. అక్కడ ఇంకా అల్లర్లు చల్లారడం లేదు. తాజాగా మణిపుర్ అల్లర్లపై శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ జరుగుతున్న అల్లర్ల వెనుక చైనా హస్తం ఉందని ఆరోపించారు.
మణిపుర్‌లో అల్లర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమవుతోంది. అక్కడ ఇంకా అల్లర్లు చల్లారడం లేదు. తాజాగా మణిపుర్ అల్లర్లపై శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ జరుగుతున్న అల్లర్ల వెనుక చైనా హస్తం ఉందని ఆరోపించారు. ఈ విషయానికి సంబంధించి కచ్చితంగా కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మణిపుర్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని.. అయినప్పటి కూడా అలాంటి ప్రాంతాల్లో హింసను ఎవరు ప్రేరేపించారని నిలదీశారు. మణిపుర్‌లో జరుగుతున్న హింసలో డ్రాగన్ హస్తం ఉందని.. దీనికి కేంద్రం ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దాదాపు అల్లర్లు మొదలై 40 రోజులైన ఇంకా హింస కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. అక్కడి ప్రజలు తమ సొంత ఇళ్లు వదిలివెళ్లిపోయి పునారావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.
అలాగే మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా స్పందించారు. మణిపుర్ అల్లర్లలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జోక్యం చేసుకోకపోతే పదిరోజుల్లోనే అవి అదుపులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మణిపుర్ సీఎం కూడా రాజీనామ చేసి.. రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజనామ చేయడానికి వెళ్లి చివరి నిమిషాంలో దాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..