Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ప్రధాని మోదీకి అద్భుత శక్తులున్నాయ్.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..

Congress Leader Praises PM Modi: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రాజకీయంగా ఏదో వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు.

PM Narendra Modi: ప్రధాని మోదీకి అద్భుత శక్తులున్నాయ్.. కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 14, 2022 | 11:31 AM

Shashi Tharoor Praises PM Modi: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రాజకీయంగా ఏదో వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా శశి థరూర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కొనియాడారు. యూపీ విజయం ఘనత ప్రధాని మోదీదే అంటూ థరూర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన శక్తి, చైతన్యం కలిగిన వ్యక్తి.. రాజకీయంగా ఆకట్టుకునేలా కొన్ని పనులు చేశారంటూ థరూర్ పేర్కొన్నారు. జైపూర్ సాహిత్య సదస్సులో పాల్గొన్న శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన మట్లాడుతూ.. బీజేపీ ఇంత గొప్ప మెజారిటీతో గెలుస్తారని తాము ఊహించలేదన్నారు. కానీ ప్రధాని మోదీ దానిని సాధ్యం చేశారని థరూర్ పేర్కొన్నారు. నేడు ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారని.. ఏదో ఒక రోజు వారు బీజేపీయే ఆశ్చర్యపోయేలా షాకిస్తారంటూ చెప్పుకొచ్చారు.

యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని కేవలం కొద్ది మందే అంచనా వేసినట్టు శశి థరూర్ పేర్కొన్నారు. అయితే.. బీజేపీ అంతటి మెజారిటీతో అధికారం సాధిస్తుందని ఎక్కువ మంది ప్రజలు అనుకోలేదన్నారు. అదే సమయంలో శశిథరూర్ ప్రధానిపై విమర్శలు కూడా ఎక్కు పెట్టారు. సమాజంలో ఆయన కొన్ని శక్తులను ప్రవేశపెట్టారు. మత, ప్రాంతీయ ప్రాతిపదికన జాతిని విభజించడమే వాటి పని.. అవి ఎప్పటికప్పుడు విషాన్ని ప్రజలకు ఎక్కిస్తున్నాయంటూ థరూర్ మండిపడ్డారు.

యూపీ ఎన్నికల ఫలితాలను చూసి తాను ఆశ్చర్యపోయానని, రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయాన్ని చాలా తక్కువగా అంచనా వేశాయన్నారు. మరికొందరు సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంటుందని పేర్కొన్నాయని తెలిపారు. బీజేపీ ఇంత మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని చాలా మంది ఊహించలేదని.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి)కి కూడా సీట్లు పెరిగాయంటూ పేర్కొన్నారు.

Shashi Tharoor

Shashi Tharoor

యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పనితీరుపై ఆయన మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ కోసం శక్తివంతమైన ప్రచారం చేశారని, ఏదో ఒక కారణంతో తప్పుబట్టడం కరెక్ట్ కాదన్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీ ఉనికి కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా తగ్గిపోతుందని.. అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించిన చాలా సమస్యలు అలానే ఉన్నాయని భావిస్తున్నట్లు శశిథరూర్ పేర్కొన్నారు.

Also Read:

Viral Photo: ఈ ఫొటోలో ముఖ్యమంత్రి ఉన్నారు.. యూత్ ఐకానిక్ ఈయనే.. గుర్తుపడితే మీరు జీనియస్..

Watch Video: సొంత ప్రభుత్వంపైనే దండెత్తిన మాజీ సీఎం ఉమాభారతి.. మద్యం షాపుపై దాడి చేసి వార్నింగ్.. వీడియో