Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీ కుమార్తె రచించిన పుస్తకంలో సంచలన విషయాలు..

ప్రణబ్‌ముఖర్జీపై ఆయన కూతురు శర్మిష్ఠ విడుదల చేసిన పుస్తకంలో కాంగ్రెస్‌పై మరిన్ని బాంబులు పేలుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ బిడ్డ పీవీకి సోనియా చేసిన అవమానాన్ని ఎప్పటికి క్షమించనని ప్రణబ్‌ తనతో చెప్పినట్టు శర్మిష్ట వెల్లడించారు.

Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీ కుమార్తె రచించిన పుస్తకంలో సంచలన విషయాలు..
Sharmistha Mukherjee Write A Book About The Pranab Mukherjee's Thoughts On Nehrus Family
Follow us
Srikar T

|

Updated on: Dec 07, 2023 | 10:00 PM

ప్రణబ్‌ముఖర్జీపై ఆయన కూతురు శర్మిష్ఠ విడుదల చేసిన పుస్తకంలో కాంగ్రెస్‌పై మరిన్ని బాంబులు పేలుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అందులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ బిడ్డ పీవీకి సోనియా చేసిన అవమానాన్ని ఎప్పటికి క్షమించనని ప్రణబ్‌ తనతో చెప్పినట్టు శర్మిష్ట వెల్లడించారు. పీవీ మరణం కూడా కూడా సోనియాతో ఉన్న గ్యాప్‌ను పూడ్చలేకపోయిందన్నారు. పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రాకుండా సోనియా అడ్డుకున్నారని తన తండ్రి చెప్పారని పుస్తకంలో రాశారు శర్మిష్ఠ. పీవీకి జరిగిన అవమానం తనను జీవితాంతం బాధించిందన్నారు. ప్రణబ్‌, మై ఫాదర్‌: ఏ డాటర్‌ రిమెంబర్స్‌ పేరుతో శర్మిష్ఠ పుస్తకం విడుదల చేశారు.

తాను ప్రధాని కాకుండా సోనియాగాంధీ అడ్డుపడ్డినట్లు ప్రణబ్‌ ముఖర్జీ తనతో చెప్పారని షర్మిష్ఠ ఈ పుస్తకంలో రాశారు. పదవినే ఆశించనపుడు, అసంతృప్తే ఉండదని తన తండ్రి చెప్పినట్లు షర్మిష్ట రాశారు. అలాగే రాహుల్‌గాంధీ రాజకీయంగా పరిణతి చెందలేదనీ, ఆయన పార్లమెంటుకు రెగ్యులర్‌గా రాకపోవడంపై తన తండ్రికి నచ్చకపోయేదన్నారు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన విషయాలు, ప్రణబ్ డైరీతో పాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. అందులో నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్‌ గాంధీ రాజకీయ భవిష్యత్తు.. ఇలా పలు ఆసక్తికర అంశాలను వివరించారు. గాంధీ-నెహ్రూ కుటుంబాల అహంకారమంతా రాహుల్‌కు వచ్చింది. కానీ వారి రాజకీయ చతురత ఆయనకు అబ్బలేదని ప్రణబ్‌ తన డైరీలో రాసుకున్నారని షర్మిష్ట తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..