AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartar Singh Sarabha: చరిత్ర పుటలో కనిపించని వీరుడు..19 ఏళ్లకే దేశస్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కర్తార్ సింగ్..

Kartar Singh Sarabha: స్వాతంత్ర సంగ్రామచరిత్రలో కనిపించని వీరుడు.. కనీసం మన పాఠ్యపుస్తకాలలోనూ వినిపించని ధీరుడు.. 19 ఏళ్లకే ఈ దేశస్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన..

Kartar Singh Sarabha: చరిత్ర పుటలో కనిపించని వీరుడు..19 ఏళ్లకే దేశస్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కర్తార్ సింగ్..
Kartar Singh Sarabha
Surya Kala
|

Updated on: Nov 17, 2021 | 12:10 PM

Share

Kartar Singh Sarabha: స్వాతంత్ర సంగ్రామచరిత్రలో కనిపించని వీరుడు.. కనీసం మన పాఠ్యపుస్తకాలలోనూ వినిపించని ధీరుడు.. 19 ఏళ్లకే ఈ దేశస్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు.. బ్రిటిష్ వారిమీద తిరుగుబాటు తప్పు.. క్షమించమని అడిగితే ప్రాణ బిక్ష పెడతామని చెప్పిన జడ్జికి.. నేను ఆంగ్లేయుల దోపిడీమీద దాడి చేశాను.. మళ్ళీ వారినే క్షమించమని అడుగుతానా.. మీరు నాకు ఉరి శిక్ష వేయండి.. మళ్ళీ జన్మ ఉంటే నేను మళ్ళీ భారతదేశంలోనే పుడతాను..అప్పుడు కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడతాను అంటూ చెప్పేసరికి జడ్జి ఉరిశిక్షను విధించాడు. దీంతో 19 ఏళ్ళ చిరుప్రాయానికే ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు కర్తార్ సింగ జోహార్.

1896 మే 24 న సరభా (లూథియానా జిల్లాలోని) గ్రామంలో కర్తార్ సింగ్చాజన్మించాడు. నాలుగేళ్ళ వయస్సులో తన తండ్రిని కోల్పోయిన కర్తార్ ను తాత సర్దార్ మంగళ్ సింగ్ పెంచారు. గ్రామ పాఠశాలలో తన ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత.. కర్తార్ సింగ్ లుథియానాలోని ఖల్సా పాఠశాలలో చేరాడు. చదువులో సగటు విద్యార్థి.. అయితే మంది క్రీడాకారుడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయన సొంతం. 1912 లో ఉన్నత చదువుల కొరకై అమెరికా వెళ్ళాడు. 1912లో, శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో దిగిన తర్వాత, ఇమ్మిగ్రేషన్ అధికారులు కర్తార్ ను ప్రత్యేక విచారణ కోసం నిర్బంధించారు. అధికారి కర్తార్ ను అడిగిన ప్రశ్నకు సమాధానంగా “నేను చదువు కోసం భారత దేశం నుంచి ఇక్కడికి వచ్చాను” అని సమాధానమిచ్చాడు. అప్పుడు ఆ అధికారి, “మీకు భారతదేశంలో చదువుకోవడానికి చోటు దొరకలేదా?” అంటే.. “నేను ఉన్నత చదువును కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. దీంతో మీరు చదవడానికి ఇక్కడ అనుమతి ఇవ్వకపోతే అంటే.. దీనికి కర్తార్ సింగ్ ఇలా బదులిచ్చారు.. “నేను దానిని తీవ్రమైన అన్యాయంగా భావిస్తాను. చదుకునే విద్యార్థులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రపంచ ప్రగతి ఆగిపోతుంది. ఎవరికి తెలుసు ఇక్కడి విద్య ప్రపంచానికి మేలు చేసే గొప్ప కార్యాన్ని సాధించడానికి నాకు శక్తినిస్తుందని చెప్పిన సమాధానంతో ముగ్ధుడైన అధికారి కర్తార్ కు అనుమతించాడు.

అక్కడ గద్దర్ పార్టీలో చేరాడు. బాంబులు తయారుచేయడం ,ప్రయోగించడం నేర్చుకున్నాడు. అత్యంత చురుకైన కార్యకర్తగా పేరు సంపాదించుకున్నాడు. ఆయుధపోరాటం ద్వారానే స్వాతంత్రం సంపాదించాలనే ఆశయంతో 1915 ఫిబ్రవరి 21 న 20 వేలమంది విప్లవకారులతో ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ పై దాడి ద్వారా సమరం మొదలు పెడుదామనుకున్నాడు. అయితే “కృపాల్ సింగ్ అనే వ్యక్తి నమ్మకద్రోహివల్ల కర్తార్ సింగ్ తో పాటు 80 మందిని పోలీసులు అరెష్ట్ చేసారు.

1915 నవంబరు 17 ఆ యువకుడిని ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనమనవాడిని చూడటానికి  తాత బదన్ సింగ్ వస్తే.. ఏడుస్తున్న తాతను ఓదార్చుతూ..తాతా..ఎందుకు ఏడుస్తున్నావు?? నేనేమీ మీరు తలదించుకొనే పనిచేయలేదు. ఒక పోరాటవీరునిగా ఆత్మార్పణ చేస్తున్నాను..మీరు ఏడిస్తే నాకు ప్రాణం మీద తీపిరావచ్చు..బతకాలనే కోరికరావచ్చు.జడ్జిని క్షమాపణకోరవచ్చు..కోరమంటావా తాత అని అన్నాడు.అంతే టక్కన కన్నీళ్ళు తుడుచుకొని తన చేతులతో మనవుడి మొహాన్ని దగ్గర తీసుకొని నుదిటిన ముద్దు పెట్టుకొని,అక్కడ నుండి వడివడివెళ్ళిపోయాడా తాత. ఇద్దరు సిపాయలు వచ్చి పెడరెక్కలు పట్టుకోబోగా..వారిని వారించి తనే నడుచుకుంటు ఉరికొయ్య దగ్గరకు వచ్చి ..వందేమాతరం అంటూ ఉరితాడు మెడకు తగిలించుకొన్నాడు. అనంతలోకాలకు వెళ్ళిపోయాడు కర్తార్ సింగ్ సరాభా..ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్.

Also Read:  ఆ దేశంలో తినే ఆహారపదార్ధాల లిస్ట్‌లో మిడతలు.. ప్రోషకాలకు నిలయం ఈ కీటకాలు .. ఎలా తినాలంటే..