locusts Food: ఆ దేశంలో తినే ఆహారపదార్ధాల లిస్ట్‌లో మిడతలు.. ప్రోషకాలకు నిలయం ఈ కీటకాలు .. ఎలా తినాలంటే..

Food For locusts: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. వలన ఆహార కొరతతో పాటు ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో తినే ఆహారపదార్ధాల్లో సరికొత్త ఆహారపదార్ధాలవైపు దృష్టి..

locusts Food: ఆ దేశంలో తినే ఆహారపదార్ధాల లిస్ట్‌లో మిడతలు.. ప్రోషకాలకు నిలయం ఈ కీటకాలు .. ఎలా తినాలంటే..
Locusts
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 11:05 AM

Food For locusts: ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. వలన ఆహార కొరతతో పాటు ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో తినే ఆహారపదార్ధాల్లో సరికొత్త ఆహారపదార్ధాలవైపు దృష్టి సారించారు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ప్రత్యామ్నాయాల వైపు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా రైతుల పంటలపై దాడి చేసే కీటకాలైన ముడతలను తినే ఆహారపదార్ధాల లిస్ట్ లోకి ఓ ఖండం ఆమోద ముద్ర వేసింది. వివరాల్లోకి వెళ్తే..

మిడతలు రోజుకు 35,000 మంది తినే తిండిని ఒక్కరోజులో మ్రింగిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మిడతలు మానవులకు ఆహారంగా మారే సమయం వచ్చింది. అవును, ఇది నిజం.. మిడతలను  మానవుల ఆహారంగా యూరోపియన్  దేశాలు ఆమోదముద్ర వేశాయి. జూన్ ప్రారంభంలో.. యూరోపియన్ యూనియన్ మిడతల్లోని పసుపు రంగు మీలీవార్మ్ లార్వాలను గుర్తించింది.

మిడతలు తినడం మానవులకు సురక్షితమైనదని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెయిర్ ఇన్‌సెక్ట్స్ అభ్యర్థనతో మిడుతలు ఆహారంగా గుర్తించబడ్డాయి. ఈ సంస్థ మిడుతలు, మీల్‌వార్మ్‌లతో పాటు  హౌస్ క్రికెట్‌లు అనే కీటకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కీటకాలు చికెన్ , పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగిస్తారు. తాజాగా యూరోపియన్ యూనియన్ ఆమోదించిన ఆహార జాబితాలో మిడుతలు కూడా చేర్చబడ్డాయి. అంతే కాదు ఈ మిడతలతో పాటు, చీమలు వంటి అనేక పురుగులు, కీటకాల్లో అధిక ప్రోటీన్లు, కొవ్వు, విటమిన్లు, ఫైబర్,  ఖనిజాలతో కూడిన చాలా పోషకాలున్నాయని చెప్పారు. ఇవి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు.

యూరోపియన్ యూనియన్ నివేదిక ప్రకారం.. మిడతలను అల్పాహారంగా లేదా భోజనంగా తినవచ్చు. వాటిని ఎండబెట్టి, వాటి రెక్కలు , కాళ్లను తొలగించి లేదా పొడిగా చేసుకుని తినవచ్చు. యురోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ భద్రత స్పందిస్తూ..  ముడతలను ఎటువంటి సందేహం లేకుండా అందరూ మిడుతలను ఆహారంగా తీసుకోవచ్చని చెప్పారు. ఇందులో అధిక ప్రొటీన్ ఉంటుంది. అయితే ఈ కీటకాలను అలెర్జీ ఉన్న వ్యక్తులు ఆహారంగా తీసుకోవద్దని సూచించింది.

భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ప్రతి సంవత్సరం మిడుత దాడులతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ మిడతల దండు ప్రతి ఏడాది వేల ఎకరాల్లో పంటను నాశనం చేస్తుంది. ఈ మిడతలు గంటలో 16 నుంచి 20 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తాయి. ఒక  మిడతల గుంపులో దాదాపు 40 మిలియన్ మిడుతలు ఉంటాయి. ఇవి రోజుకు 35,000 మంది సరిపడే ఆహారాన్ని తినేస్తాయి.

Also Read: శబరిమల మహిళల ప్రవేశంపై తీర్పు కోరుతూ సీజేఐకి లేఖ రాసిన ప్రధాన పూజారి కుటుంబ సభ్యులు..