Fox Viral Video: మ్యాచ్ జరుగుతుండగా సడెన్‌గా వచ్చిన నక్క.. వీడియో చూసి తీరాల్సిందే..!
క్రికెట్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు లాంటివి జరుగుతున్నప్పుడు అక్కడికి కుక్కలు, పిల్లులు మైదానంలోకి రావడం చూస్తుంటాం. అవన్నీ పెంపుడు జంతువులు కాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు. కానీ... వన్యప్రాణి... మైదానంలోకి వస్తే...
క్రికెట్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు లాంటివి జరుగుతున్నప్పుడు అక్కడికి కుక్కలు, పిల్లులు మైదానంలోకి రావడం చూస్తుంటాం. అవన్నీ పెంపుడు జంతువులు కాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు. కానీ… వన్యప్రాణి… మైదానంలోకి వస్తే… టెన్షనే. అమెరికాలో అదే జరిగింది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలోకి సడెన్‌గా నక్క ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ నక్క ఏం చేసిందో, చివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం.
తిమోతీ బర్క్ అనే వినియోగదారు ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోని షేర్ చేశారు. ఇందులో… USC-అరిజోనా స్టేట్ గేమ్ జరుగుతోంది. ఫుట్ బాల్ మ్యాచ్ మొదలైన కాసేపటికే… ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ పిల్ల నక్క… పరుగెడుతూ మైదానంలోకి వచ్చింది. వెంటనే రికార్డింగ్ కెమెరాలతో దాన్ని ఫోకస్ చేశారు. అది పిల్లి అనుకున్నారు. కానీ దాని తోకను బట్టి అది… నక్క అని అర్థమైంది.
టీవీల్లో ఆ నక్క కనిపించడంతో… ఆట చూస్తున్న ప్రేక్షకులంతా… ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దాన్ని చూసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆ నక్క వేగంగా పరుగెడుతూ… ప్రేక్షకుల మధ్య నుంచి పారిపోయింది నవంబర్ 7న పోస్ట్ చేసిన ఈ వీడియోని లక్షలమంది వీక్షిస్తున్నారు. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఓ జర్నలిస్ట్… కామెంట్ రూపంలో ఓ అప్‌డేట్ ఇచ్చారు. మ్యాచ్ జరుగుతున్న స్టేడియంకి దగ్గర్లోనే ఓ నక్కల కుటుంబం జీవిస్తోందట. కొన్నేళ్లుగా ఆ నక్కలు అక్కడే ఉన్నా… ఎప్పుడూ ఎవరి జోలికీ రాలేదు. ఆహారం కోసమే ఆ పిల్ల నక్క స్టేడియంలోకి వచ్చి ఉంటుందని జర్నలిస్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..