AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు అలెర్ట్.. ‘స్పెషల్’ ట్యాగ్‌కు స్వస్తి.. ఇకపై పాత నంబర్లతోనే రైళ్ల సర్వీసులు.. 

Indian Railways to discontinue 'special' trains: కరోనావైరస్ నాటినుంచి రవాణా రంగం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత రైల్వే కూడా ఆర్థికంగా కోట్లాది రూపాయలు

Indian Railways: ప్రయాణికులకు అలెర్ట్.. ‘స్పెషల్’ ట్యాగ్‌కు స్వస్తి.. ఇకపై పాత నంబర్లతోనే రైళ్ల సర్వీసులు.. 
Trains
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2021 | 12:06 PM

Share

Indian Railways to discontinue ‘special’ trains: కరోనావైరస్ నాటినుంచి రవాణా రంగం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారత రైల్వే కూడా ఆర్థికంగా కోట్లాది రూపాయలు నష్టపోయింది. పరిస్థితులు కొంతమేర మారిన అనంతరం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపించింది. ప్రస్తుతం అన్నిచోట్ల స్పెషల్ ట్రైన్స్ సర్వీసులే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో నడిపిస్తున్న స్పెషల్ రైళ్ల అనే ముద్రను తొలగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కోవిడ్‌కు ముందు మాదిరిగానే పాత నంబర్లతోనే రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న వారికి మారిన రైలు నంబర్లను ఎస్ఎంఎస్ ద్వారా పంపినట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

ఈ మేరకు రైల్వే టైమ్ టేబుల్- 2021 లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది. 76 రైళ్లకు స్పెషల్ నంబర్లను తొలగించి రెగ్యులర్‌ రైళ్లుగా మార్చినట్లుగా అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో 76 రైళ్లు కరోనా ముందునాటి నంబర్లతో తిరిగి సేవలు అందించనున్నాయి.

ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే మారిన రైళ్ల నంబర్ల జాబితాను విడుదల చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమయ్యే పలు రైళ్ల వివరాలు ఉన్నాయి. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
Also Read: