Shah Karnataka Tour Today: కర్ణాటక పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజిబిజీ.. పలు అభివృద్జి పనులకు శంకుస్థాపన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బాగల్‌కోట్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ మైదానంలో..
Shah Karnataka Tour Today: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బాగల్‌కోట్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ మైదానంలో జరిగే ర్యాలీలోపాల్గొననున్నారు. బహిరంగ అమిత్ షా ప్రసంగించనున్నారు. జిల్లాలోని కరకల్‌మట్టి గ్రామంలో ఉదయం కేదార్‌నాథ్ షుగర్, ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇథనాల్ ప్రాజెక్ట్‌తో పాటు కేఎల్‌ఈ హాస్పిటల్ అడ్వాన్డ్స్ సిములేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం బెలగావిలోని జేఎన్‌ఎంసీ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. రెండు రోజుల పర్యటనలో శనివారం అమిత్‌షా శివమొగ్గలోని భద్రావతి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
Also Read: యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనం చేస్తున్న ముఠా అరెస్ట్, బంగారు ఆభరణాలు, 23 బైకులు స్వాధీనం