కోవాగ్జిన్ సేఫ్, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం 42 రోజుల తరువాతే యాంటీ బాడీల డెవలప్ మెంట్, నిపుణుల వెల్లడి

కోవాగ్జిన్ సురక్షితమైనదని, ఈ టీకామందు తయారీకోసం రీసెర్చర్లు చేసిన కృషి, పడిన శ్రమ మంచి ఫలితాలనిచ్చాయని రోహ్తక్ లోని పీజీఐఎంఎస్ కో-ఇన్వెస్టిగేటర్..

  • Umakanth Rao
  • Publish Date - 1:32 pm, Sun, 17 January 21
కోవాగ్జిన్ సేఫ్, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం 42 రోజుల తరువాతే యాంటీ బాడీల డెవలప్ మెంట్, నిపుణుల వెల్లడి

కోవాగ్జిన్ సురక్షితమైనదని, ఈ టీకామందు తయారీకోసం రీసెర్చర్లు చేసిన కృషి, పడిన శ్రమ మంచి ఫలితాలనిచ్చాయని రోహ్తక్ లోని పీజీఐఎంఎస్ కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ రమేష్ వర్మ తెలిపారు. ఆరు నెలల క్రితం వాలంటీర్లు తమకు తాముగా ట్రయల్స్ కోసం ముందుకు రావడం, వైద్య సిబ్బంది, సపోర్ట్ స్టాఫ్ 24 గంటలూ నిర్విరామంగా చేసిన కృషి ఫలించిందని అన్నారు. వలంటీర్లపై మూడు ట్రయల్స్ నిర్వహించామని, ఇంచుమించు అన్ని రిజల్ట్స్ ఎంకరేజింగ్ గా ఉన్నాయన్నారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు టీకామందులూ మంచివే.. సురక్షితమైనవి, నాణ్యమైనవి అన్నారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలని రమేష్ వర్మ చెప్పారు. 42 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయన్నారు. జనవరి 6 న మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు వర్మ పేర్కొన్నారు. కాగా కోవిడ్ నుంచి కోలుకున్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకోవలసి ఉంటుందని ఆయన వివరించారు. కొవాగ్జిన్ పై వఛ్చిన వదంతులమీద వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

Also Read:

Health News: వెల్లుల్లి తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ? వివరాలు మీకోసం..

11 Marriages At The Age Of 22: ఆ యువకుడు వయస్సు 22 ఏళ్ళు, చేసుకున్న పెళ్లిళ్లు 11.. లవ్లీ గణేష్ గా యువతులకు వల

కుర్రాళ్లు దంచికొట్టారు.. టీమిండియా అదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్..