Harassment: పవిత్ర స్థలంలో పాడు పనులు.. ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులపై రోడ్డెక్కిన విద్యార్థులు

చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌లోని కీచక అధ్యాపకుడి నిర్వాకం ప్రకంపనలు రేపుతోంది. డాన్స్‌ టీచర్‌ ప్రొఫెసర్‌ హరిపద్మన్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ పూర్వ విద్యార్థిని కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Harassment: పవిత్ర స్థలంలో పాడు పనులు.. ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులపై రోడ్డెక్కిన విద్యార్థులు
Kalakshetra Foundation Students
Follow us

|

Updated on: Apr 02, 2023 | 6:30 AM

అదో కళా వేదిక..తమిళనాడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నడిచే సాంప్రదాయ కళల బోధనాలయం..కళాకారులు అత్యంత పవిత్రంగా భావించే చోట గత చాలాకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగితోన్న ఓ అరాచక అధ్యాపకుడి నిర్వాకం తమిళనాట కలకలం రేపింది. విద్యార్థుల ఆందోళనలతో చెన్నై అట్టుడికింది. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్‌లోని కీచక అధ్యాపకుడి నిర్వాకం ప్రకంపనలు రేపుతోంది. డాన్స్‌ టీచర్‌ ప్రొఫెసర్‌ హరిపద్మన్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఓ పూర్వ విద్యార్థిని కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్వయానా విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాట కలకలం రేపుతోంది. శాస్త్రీయ కళలు బోధించే చెన్నై కళాక్షేత్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హరిపద్మన్‌…డాన్స్‌ టీచర్‌ అయిన ఇతడు పోకిరీ అవతారమెత్తాడు. శిక్షణకోసం వచ్చే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు తెగించాడు. దీంతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఏకంగా 200 మంది విద్యార్థినులు.. అధ్యాపకుడి వేధింపులపై ఫిర్యాదు చేశారు.

అబ్బాయిలపై కూడా ..

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హరిపద్మన్‌, మరో ముగ్గురు రిపర్టరీ అధ్యాపకులు తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయాన్ని పూర్వ విద్యార్థి ఒకరు బయటపెట్టారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ…బాడీషేమింగ్‌కి పాల్పడుతూ..విద్యార్థినులను అవమానిస్తోన్న హరిపద్మన్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు హోరెత్తాయి. తల్లిదండ్రులతో సహా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి, ఆందోళనలకు దిగారు. అసెంబ్లీలో సైతం ఇష్యూ చర్చకి రావడంతో స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తాత్కాలికంగా ఆందోళనలను విరమించారు విద్యార్థులు. మరోవైపు ఇదే కళాక్షేత్రలో మరో ముగ్గురు అధ్యాపకులు గత చాలాకాలంగా ఇటు అమ్మాయిలను, మరోవైపు అబ్బాయిలపై సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు.

గతంలోనూ..

అయితే గతంలో సైతం హరిపద్మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అతడిపై విద్యార్థినులు జాతీయ మహిళా కమిషన్‌కి గతంలో ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో నిజంలేదంటూ ఆరోజు మహిళా కమిషన్‌ కొట్టిపారేసింది. తాజాగా అవే ఆరోపణలపై వందలాది మంది విద్యార్థునులు ఫిర్యాదు చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..