ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌.. మూడో దశ ట్రయల్స్‌కి గ్రీన్‌సిగ్నల్‌

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాస్త ఊరటను కలిగించే వార్తను వెల్లడించింది.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌.. మూడో దశ ట్రయల్స్‌కి గ్రీన్‌సిగ్నల్‌
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 1:17 PM

Covid 19 vaccine trial: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాస్త ఊరటను కలిగించే వార్తను వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్‌కి సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది. ఈ ట్రయల్స్‌లో 1600 మందికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ తయారీదారికీ అనుమతిని పొందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభించనుంది.

ఇందు కోసం పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ట్రయల్స్‌లో భాగంగా మొదటి రోజు వందమందికి టీకాలు వేస్తారు. కరోనా హాట్‌స్పాట్‌లుగా ఉన్న ఐదు వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాలు, ఆసుపత్రులను ఎంపిక చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో పాల్గొనేవారు వ్రాతపూర్వక సమ్మతి ఇవాల్సి ఉంటుందని, అలాగే స్టడీ ప్రోటోకాల్ అవసరాలకు అనుగుణంగా అధ్యయన ప్రాంతంలోనే నివసించాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.

Read More:

Breaking: నిలిచిపోయిన జీమెయిల్‌ సేవలు

సుశాంత్‌ కేసు: స్వర భాస్కర్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు