అయోధ్యలో రాళ్లతోనే రామాలయ నిర్మాణం, ట్రస్ట్

అయోధ్యలో రామాలయాన్ని కేవలం రాళ్లతోనే నిర్మిస్తామని, అప్పుడీ ఆలయం వెయ్యి ఏళ్లయినా చెక్కు చెదరదని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిర్మాణ ప్రక్రియలో చెన్నైలోని ఐఐటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ నిమగ్నమై ఉన్నాయని....

  • Umakanth Rao
  • Publish Date - 1:18 pm, Thu, 20 August 20
అయోధ్యలో రాళ్లతోనే రామాలయ నిర్మాణం, ట్రస్ట్

అయోధ్యలో రామాలయాన్ని కేవలం రాళ్లతోనే నిర్మిస్తామని, అప్పుడీ ఆలయం వెయ్యి ఏళ్లయినా చెక్కు చెదరదని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిర్మాణ ప్రక్రియలో చెన్నైలోని ఐఐటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ నిమగ్నమై ఉన్నాయని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. నిర్మాణ బాధ్యతను లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ పర్యవేక్షిస్తున్నప్పటికీ, మట్టి నమూనాల విశ్లేషణకు చెన్నై లోని  ఐఐటీ సంస్థను, భూకంపాన్ని కూడా తట్టుకోవడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న దానిపై సెంట్రల్ బిల్డింగ్ ఇన్స్ టిట్యూట్ ను సంప్రదిస్తున్నామని ఆయన చెప్పారు.

గుడి నిర్మాణానికి సుమారు 10 వేల రాగి రాడ్స్ అవసరమని, దీన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా ప్రజలెవరైనా రాములవారి సేవలో తరించవచ్చునని చంపక్ రాయ్ వ్యాఖ్యానించారు. కేవలం రాళ్లను వినియోగించి ఆలయాన్ని నిర్మించడంవల్ల ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకోగలదని ఆయన చెప్పారు.