Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. దోషులకు క్షమాభిక్ష రద్దు..

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

Supreme Court: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. దోషులకు క్షమాభిక్ష రద్దు..
Bilkis Bano Case
Follow us
Srikar T

|

Updated on: Jan 08, 2024 | 11:46 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 2002నాటి గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్‌ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది. రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని కరాఖండీగా చెప్పింది. 11 మంది రేపిస్టుల విడుదలను సవాల్‌చేస్తూ, బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని సుప్రీం తెలిపింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో, 11 మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది. వీరిని 2022 ఆగస్ట్‌ 15వ తేదీన గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసి జైలు నుంచి బయటకు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు బాధితురాలు బిల్కిస్ బానో. ఈ కేసులో దోషులుగా జీవితఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బల్కిస్ బానో. ఈ కేసుకు పూర్వాపరాలు పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు బిల్కిస్ బానో పిటిషన్ వేయడం సరైనదే అని తేల్చింది. దీంతోపాటు 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి చెల్లుచీటి ఇచ్చింది.

ఈ కేసును పూర్తిగా పరిశీలించినట్లైతే.. 2002 లో జరిగిన గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణిగా ఉన్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా కుటుంబంలోని వారిని చిన్నా పెద్దా అని చూడకుండా ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే గతేడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ 11 మంది దోషులకు రెమిషన్ పై విడుదల చేశారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బాధితురాలు బిల్కిస్ బానో గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ 11 మంది నిందితులు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ లోన్ పై ఎక్స్‌ట్రా లోన్ తీసుకోవాలా.. పూర్తి ప్రాసెస్ ఇది
పర్సనల్ లోన్ పై ఎక్స్‌ట్రా లోన్ తీసుకోవాలా.. పూర్తి ప్రాసెస్ ఇది
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!