AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..! ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేయండి..!

మనలో చాలా మందికి ఇష్టమైనది.. చాలా త్వరగా తయారయ్యే మష్రూమ్ బిర్యానీ రెసిపీని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా సువాసనలు, మష్రూమ్ నెమ్మదిగా ఉడికే తీపి రుచితో అన్నంలో కలిసే అద్భుతమైన కాంబినేషన్. దీన్ని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడుతారు. తక్కువ కష్టం, ఎక్కువ రుచితో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు.

రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..! ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేయండి..!
Mushroom Biryani Receipe
Prashanthi V
|

Updated on: Mar 24, 2025 | 8:24 PM

Share

మష్రూమ్ బిర్యానీ.. మనకు త్వరగా తయారయ్యే రుచికరమైన వంటకం. సాధారణ బిర్యానీలతో పోలిస్తే ఇది తక్కువ సమయంలో తయారవుతుంది. మసాలా రుచిని ఎక్కువగా కోరేవారు కొంచెం అదనంగా మసాలాలు వేసుకోవచ్చు. ఇంట్లో ఈ బిర్యానీని ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • మష్రూమ్ – 250 గ్రాములు
  • బాస్మతి బియ్యం – 1 కప్పు
  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిర్చి – 2
  • అల్లం-వెల్లులి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • బటానీలు, క్యారెట్ – కొద్దిగా
  • గరం మసాలా – 2 టీ స్పూన్లు
  • మిర్చి పొడి – 1 టీ స్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – తగినంత
  • కొత్తిమీర, పుదీనా – తగినంత
  • యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క – తగినంత
  • నీరు – 2 కప్పులు

తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాలు నానబెట్టి నీటిని పూర్తిగా వడకట్టాలి. మష్రూమ్‌లను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఆపై తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు వేపాలి. టమాటాలను కూడా అందులో వేసి మెత్తగా మారే వరకు ఉడికించాలి.

ఇప్పుడు మిర్చి పొడి, గరం మసాలా పొడి వేసి మసాలాలు బాగా కలిసేలా కలపాలి. ఆ తరువాత మష్రూమ్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి కొన్ని నిమిషాలు వేగించాలి. తర్వాత బియ్యం వేసి తగినంత ఉప్పు నీరు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉంచాలి. అద్భుతమైన రుచితో మష్రూమ్ బిర్యానీ సిద్ధం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు