Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Day: ఆరోజే డెలివరీ చేయండి.. వైద్యులకు గర్భిణీలు విజ్ఞప్తి..

ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు పూర్తయ్యా. దేశ నలుమూలల నుంచి హిందువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్య వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్య పట్టణంలోని హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి. ఇదిలా ఉంటే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజే, తాము బిడ్డకు జన్మనివ్వాలని కొందరు గర్భిణీలు కోరుకుంటున్నారు...

Special Day: ఆరోజే డెలివరీ చేయండి.. వైద్యులకు గర్భిణీలు విజ్ఞప్తి..
Pregnant Women
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2024 | 11:20 AM

యావత్‌ భారత దేశం జనవరి 22వ తేదీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రారంభం జరగనుంది. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది.

ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు పూర్తయ్యా. దేశ నలుమూలల నుంచి హిందువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్య వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్య పట్టణంలోని హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి. ఇదిలా ఉంటే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజే, తాము బిడ్డకు జన్మనివ్వాలని కొందరు గర్భిణీలు కోరుకుంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన నెలల నిండిన గర్భిణీలు జనవరి 22వ తేదీ రోజునే తమకు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లను కోరుకుంటున్నారు.

ప్రస్తుతం నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారు సైతం జనవరి 22వ తేదీ వరకు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తుగానే.. జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయాలని వేడుకుంటుండడం గమనార్హం. అయితే వైద్యులు మాత్రం గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు.. జనవరి 22న బిడ్డకు జన్మిస్తే రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయమని.. ఆరోజు ఎంతో పవిత్రమైందని అక్కడి వారు భావిస్తున్నారు.

కాగా జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి ఆలయ సిబ్బంది అన్ని రకాల ఏర్పాటు చేస్తోంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా సుమారు 7వేల మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆహ్వానాలను పంపించింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానం అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
భల్లాలదేవ్ తమ్ముళ్లురా ఇక్కడ.. SRHతో లక్నో ఢీ.. భయంలో పంత్..
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?ఈ పొరపాటు చేయకండి వీడియో
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
రామ్ చరణ్ ఆర్సీ 16 నుంచి చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!