Holidays: వారం రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. అసలు కారణం ఇదే..
ఉత్తరాది రాష్ట్రాలను చలి పులి ఒణికిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు తీవ్రమైన చలిగాలుల ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా పంజాబ్ ప్రభుత్వం స్కూళ్లకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఉత్తర భారత దేశాన్ని ఎముకలు కొరికే చలి కాటేస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించడంలేదు. రహదారులన్నీ మంచుతో కప్పబడుతున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాలను చలి పులి ఒణికిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు తీవ్రమైన చలిగాలుల ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా పంజాబ్ ప్రభుత్వం స్కూళ్లకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఉత్తర భారత దేశాన్ని ఎముకలు కొరికే చలి కాటేస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఉదయం 10 గంటలైనా సూర్యుడు కనిపించడంలేదు. రహదారులన్నీ మంచుతో కప్పబడుతున్నాయి. వృద్దులు, చిన్న పిల్లలకు శ్వాససంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. కొందరు అనారోగ్యాలపాలవుతున్నారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం వారం రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పగటి ఉష్టోగ్రత గరిష్టంగా 14 డిగ్రీలుగా నమోదవుతోంది. కనిష్ఠ ఉష్టోగ్రత 6 నుంచి 7 డిగ్రీలకు చేరుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 8 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు వారం రోజుల పాటు సెలవులు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నర్సరీ నుంచి 10 వ తరగతి వరకు అన్ని పాఠశాలలు మూసి ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక ఢిల్లీలో మొన్నటి వరకూ తీవ్రంగా కమ్మేసిన పొగ మంచు తాజాగా పంజాబ్ ను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఉదయం పొగమంచు కారణంగా అనేక ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోయింది. గతంలో 300 నుంచి 500 మీటర్ల వరకూ ఉన్న దృశ్యమానత.. తాజాగా 50 నుంచి 100 మీటర్లకు పడిపోయింది. దీంతో రోడ్లపై ప్రయాణించే వాహన దారులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. అలాగే అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు రావడంలేదు. వాహనాల ముందు భాగంలో లైట్లు వేసుకుని ప్రయాణించాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అమృత్‌సర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. లూథియానా, పటియాలా, పఠాన్‌కోట్, బటిండా, ఫరీద్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..