Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Game: చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు.

Online Game: చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితుడు.

Anil kumar poka

|

Updated on: Jan 08, 2024 | 11:10 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఓ బీఎస్సీ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్‌లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న అతన్ని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్‌ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఓ బీఎస్సీ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్‌లైన్ గేమ్‌లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్‌లైన్ గేమ్‌లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న అతన్ని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్‌ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. విద్యార్థి కిడ్నాప్‌పై పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. ఆ కుర్రాడు కిడ్నాప్ అయినట్లు నాటకం ఆడాడని తేల్చారు. అదే విషయాన్ని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.