Folding iPhone Price: ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఇది ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది?
Folding iPhone Price: ఆపిల్ ఐఫోన్.. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ విడుదల అవుతుంటుంది. దీని గురించి ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఆపిల్ నుంచి తొలి పోల్డబుల్ ఐఫోన్ ఎప్పుడు వస్తుంది..? దాని ధర ఎంత?

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుందని సమాచారం. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఆపిల్ ఫోన్ ఖరీదైన ధరతో ప్రీమియం కేటగిరీ కింద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే పరిశ్రమ విశ్లేషకుడు టిమ్ లాంగ్ మాట్లాడుతూ.. ఫోల్డబుల్ ఐఫోన్ ధర USలో $2,300 (సుమారు రూ. 1,91,000) వరకు ఉండవచ్చని పేర్కొన్నారు.
కంపెనీ తన ఫోల్డబుల్ ఐఫోన్‌పై పనిచేస్తోంది. ఈ ఆపిల్ ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి చాలా పుకార్లు ఉన్నాయి. ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026 లో విడుదల చేసే అవకాశం ఉంది. లేదా కంపెనీ ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను 2027 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు.
ధర ఎంత ఉండనుంది?
ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర $2,000, $2,500 (రూ.1,66,000 నుండి 2,08,000) మధ్య ఉండవచ్చ టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు టిమ్ లాంగ్ కూడా ఈ ఐఫోన్ ఈ ధర పరిధిలోనే లాంచ్ అవుతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: IPL 2025: మీరు క్రికెట్ అభిమానులా..? జియో, ఎయిర్‌టెల్, విఐ ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి