AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి… శవయాత్రలో షాకింగ్‌ ఘటన

శవయాత్ర అంటే.. ఏవరైనా ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి మోసుకెళతారు. శ్మశానానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బతికున్న వ్యక్తిని పాడెపై పొడుకొ పెట్టి.. శ్మశానానికి తీసుకువెళ్లే దృశ్యం ఎప్పుడైనా చూశారా? అంటే ఎవరైనా చూడలేదనే సమాధానం చెబుతారు. కానీ, రాజస్థాన్‌లోని భీల్వాడాలో మాత్రం అదో వేడుకగా నిర్వహిస్తారు. పైగా ఇది కొన్ని శతాబ్దాల నుంచి కొనసాగుతోన్న ఆచారం అని గర్వంగా చెబుతారు. భీల్వాడలో హోలీ పండగ ముగిసిన వారం

Video: పాడెపై నుంచి లేచి ఉరికిన వ్యక్తి... శవయాత్రలో షాకింగ్‌ ఘటన
Bhilwara Holi Funeral
K Sammaiah
|

Updated on: Mar 24, 2025 | 6:02 PM

Share

శవయాత్ర అంటే.. ఏవరైనా ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి మోసుకెళతారు. శ్మశానానికి తీసుకు వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బతికున్న వ్యక్తిని పాడెపై పొడుకొ పెట్టి.. శ్మశానానికి తీసుకువెళ్లే దృశ్యం ఎప్పుడైనా చూశారా? అంటే ఎవరైనా చూడలేదనే సమాధానం చెబుతారు. కానీ, రాజస్థాన్‌లోని భీల్వాడాలో మాత్రం అదో వేడుకగా నిర్వహిస్తారు. పైగా ఇది కొన్ని శతాబ్దాల నుంచి కొనసాగుతోన్న ఆచారం అని గర్వంగా చెబుతారు. భీల్వాడలో హోలీ పండగ ముగిసిన వారం రోజుల తర్వాత ఓ వేడుక నిర్వహిస్తారు. బతికున్న వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి ఘనంగా ఊరేగిస్తారు. రంగులు చల్లుకుంటూ.. భారీ ఎత్తున సంగీత వాయిద్యాలతో శవయాత్ర నిర్వహిస్తారు.

చిత్తోర్‌గఢ్ భవనం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకను డోల్ అని పిలుస్తారు. ఊరంతా తిరిగి చివరకు ఓ ఆలయం వద్దకు తీసుకెళతారు. పాడెపై పడుకున్న వ్యక్తి.. ఈ అంతియ యాత్ర మధ్యలో లేవడం, కూర్చోవడం, నీళ్లు తాగడం చేస్తుంటారు. కూర్చోవడం, నీళ్లు తాగాడం వంటివి చేస్తాడు. చివరకి ఆలయం వద్దకు ఈ యాత్ర చేరుకోగానే పాడెపై పడుకున్న వ్యక్తి ఒక్కసారిగా కిందకి దూకి పారిపోతాడు. అనంతరం పాడెను ఆలయం వెనుక దహనం చేస్తారు. ఈ శవ యాత్రను చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భీల్వాడకు భారీగా క్యూ కడతారు.

ఈ అంతిమ యాత్రలో మహిళలకు అనుమతి లేదు. ఇక ఈ ఊరేగింపులో భూతులు తిట్టుకోవడం కూడా ఆనవాయితీనే. ఈ అంతిమ యాత్ర నిర్వహించే ముందు రోజు భీల్వాడలోని ప్రత్యేక వంటకాలు వండి, నాటక ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తారు. ఈ వింత సంప్రదాయం దాదాపు నాలుగొందల ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోందని భీల్వాడ వాసులు వివరిస్తున్నారు. సమాజంలో ఏమైనా చెడు లాంటివి ఉంటే.. అవి పోయేందుకు ఈ తరహా యాత్రలు నిర్వహిస్తారని స్థానికులు వివరించారు. శవ యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో చూడండి: