AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasikala Health Updates: శశికళకు తీవ్ర అస్వస్థత.. ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో‌ ఏం తేలిందంటే..

Sasikala Health Updates: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Sasikala Health Updates: శశికళకు తీవ్ర అస్వస్థత.. ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో‌ ఏం తేలిందంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2021 | 12:43 PM

Share

Sasikala Health Updates: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అవినీతి కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్షణ అనుభవిస్తున్న ఆమె బుధవారం నాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను నగరంలోని బౌరింగ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. శశికళ తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో వైద్యాధికారులు ఆమెకు ర్యాపిడ్ టెస్ట్‌ చేయగా.. కరోనా నెగెటీవ్ అని తేలింది. అయితే అధికారులు ఆమెకు మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఇదిలాఉండగా, శశికళ ఆరోగ్యంపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శశికళ ఆరోగ్యం పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శశికళ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తమిళనాడు మాజీ సీఎం, దివంగత నాయకురాలు జయలలితకు సన్నిహితురాలైన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టుకు 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించిన శశికళ ఈ నెల 27 న విడుదల కావలసి ఉంది. దాంతో అభిమానులంతా ఆమె రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. ఒక్కసారిగా ఆమె అనారోగ్యానికి గురవడంతో వారిలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. శశికళ ఆరోగ్యం మెరుగుపడాలని దేవుళ్లకు ప్రార్థనలు చేస్తున్నారు.

Also read:

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

2021-22 బడ్జెట్, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిందే, నిధులు పెంచాల్సిందే, నిపుణుల సూచన, ఎంఎస్పీ పై ఫోకస్