2021-22 బడ్జెట్, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిందే, నిధులు పెంచాల్సిందే, నిపుణుల సూచన, ఎంఎస్పీ పై ఫోకస్

నూతన ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపును పెంచాల్సి ఉంది..

2021-22 బడ్జెట్, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసిందే, నిధులు పెంచాల్సిందే, నిపుణుల సూచన, ఎంఎస్పీ పై ఫోకస్
Follow us
Umakanth Rao

| Edited By: Team Veegam

Updated on: Jan 22, 2021 | 4:42 PM

నూతన ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్రం పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపును పెంచాల్సి ఉంది. దీర్ఘకాలిక రుణాలకు గాను అగ్రికల్చర్ పై వడ్డీ సబ్సిడీని ఇవ్వాల్సి ఉంది. పంట బీమా సౌకర్యాన్ని మరింత పెంచాల్సి ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఎక్కువమంది అన్నదాతల ప్రయోజనాలకోసం నిధుల కేటాయింపును పెంచే అవకాశం ఉంది. వెర్టికల్ ఫార్మింగ్ పై నూతన పథకాన్ని చేపడతారని భావిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతుల ఆదాయాన్ని పెంచవలసి ఉంది. మోదీ ప్రభుత్వ 1.0 హయాంలో వ్యవసాయ రంగంలో ఐదేళ్లలో మూడు శాతం వృద్ది కాగా-ఈ సారి సాలుకు 15 శాతం వృద్ది సాధిస్తుందని భావిస్తున్నారు. ఎరువులు, నీరు, విద్యుత్, విత్తనాలు వంటివాటిపై సబ్సిడీలను ఇవ్వాల్సి ఉంది. కృషి రైల్, కృషి ఉడాన్ వంటి పథకాలను చేబట్టినప్పటికీ మరిన్ని పథకాలను ప్రభుత్వం అమలులోకి తేవాల్సి ఉంది.

2019-20 లో ఈ రంగానికి ఈ మంత్రిత్వ శాఖ 1,30,485 కోట్లు కేటాయించింది.  అదే బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి 79,996 కోట్లు కేటాయించింది. అయితే సబ్సిడీల బదులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ లాంటి పథకాలను రైతులకు వర్తింపజేస్తే వారికీ ప్రయోజనకరంగా ఉంటుందని  వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. ఇన్సెంటివ్ ల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పటిష్ఠపరచాలని వారు సూచిస్తున్నారు. పన్నుల తగ్గింపు, టెక్నాలజీకి యాక్సెస్, (అందుబాటులో టెక్నాలజీ) వంటివాటి ద్వారా అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నది వారి సూచన.