Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనీట్రాప్‌ వ్యవహారంపై అట్టుడికిన అసెంబ్లీ.. సీడీలు ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్‌ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీడీలను ప్రదర్శించారు. నేతల హనీట్రాప్‌ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. మంత్రులే తమపై హనీట్రాప్‌ జరిగిందని ఆరోపిస్తున్నారని నినాదాలు చేశారు.

హనీట్రాప్‌ వ్యవహారంపై అట్టుడికిన అసెంబ్లీ.. సీడీలు ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు
Karnataka Assembly
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 21, 2025 | 2:57 PM

కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్‌ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో సీడీలను ప్రదర్శించారు. నేతల హనీట్రాప్‌ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. మంత్రులే తమపై హనీట్రాప్‌ జరిగిందని ఆరోపిస్తున్నారని నినాదాలు చేశారు. నిజనిజాలు ప్రజలకు తెలియని పట్టుబట్టారు.

మంత్రులు రాజన్న , సతీష్‌ జర్కిహోలి తమపై హనీట్రాప్‌ కుట్ర జరిగిందని అసెంబ్లీలో గురువారం(మార్చి 20) ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మరోవైపు కాంట్రాక్ట్‌ల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సభలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ ఆందోళనను కొనసాగించారు. బిల్లు ప్రతులను అసెంబ్లీలో చింపేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి స్పీకర్‌ మార్షల్స్‌ను రప్పించారు. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.

అయితే బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీట్రాప్‌ బాధితుల్లో అన్ని పార్టీల నేతలు ఉన్నారని, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి సభలో ఆందోళన చేయడం దారుణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు ముఖ్యమంత్రి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..