Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Mining: హిస్టారికల్‌ మూమెంట్‌.. బొగ్గు ఉత్పత్తిలో కొత్త చరిత్ర లిఖించిన ఇండియా!

భారతదేశం ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికత సమర్థవంతమైన మైనింగ్ పద్ధతులకు నిదర్శనం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆర్థిక వృద్ధికి ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారతదేశం గ్లోబల్ ఎనర్జీ లీడర్‌గా ఎదగడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు.

Coal Mining: హిస్టారికల్‌ మూమెంట్‌.. బొగ్గు ఉత్పత్తిలో కొత్త చరిత్ర లిఖించిన ఇండియా!
Kishan Reddy Coal
Follow us
SN Pasha

|

Updated on: Mar 21, 2025 | 2:17 PM

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌.. ఆ మార్క్‌ను సాధించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో అధికారిక అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. “హిస్టారికల్‌ మూమెంట్‌. భారతదేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది! అత్యాధునిక సాంకేతికత, సమర్థవంతమైన పద్ధతులతో, మేము ఉత్పత్తిని పెంచడమే కాకుండా స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌ నిర్వహించాం.

ఈ విజయం మా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో, భారతదేశం గ్లోబల్‌ ఎనర్జీ లీడర్‌గా ఎదిగే మార్గంలో ఉంది. దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా పనిచేస్తున్న బొగ్గు రంగం, అంకితభావంతో పనిచేసే శ్రామిక శక్తికి మంత్రి హృదయపూర్వక అభినందనలు. ఈ మైలురాయిని సాధ్యం చేసిన వారి అవిశ్రాంత కృషి, నిబద్ధతకు కృతజ్ఞతలు” అంటూ రాసుకొచ్చారు.