Half Day Schools: ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం.. ఉదయం 6.30 నుంచి 10.30 వరకే తరగతులు
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎండలు మండిపోతున్నాయ్.. తొమ్మిది దాటితే బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6.30 నుంచి 10.30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఈ వేళల్లేనో క్లాసులు నిర్వహించనున్నారు. పిల్లల భద్రత, ఆరోగ్యం తమకు ప్రధానమని అందుకే ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఒడిశా విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ వెల్లడించారు. అదే విధంగా పిల్లల కోసం చల్లని నీళ్లు, ORS అందుబాటులో ఉంచామన్నారు.
ఆంధ్రాలో….
ఇక ఏపీలో సైతం ఒంటిపూట బడుల్లో స్వల్ప మార్పులు చేసింది ఎన్డీయే సర్కార్. టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్న స్కూళ్లలో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 1.15 గంటలకే స్కూల్స్ ప్రారంభమయ్యేవి. మిగిలిన స్కూళ్లకు ఉదయం 7:45 గంటల నుంచి 12:30 గంటల వరకు తరగతలు నిర్వహించనున్నారు. టెన్త్ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్న స్కూల్స్‌లో మాత్రం… మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి.
తెలంగాణలో…
తెలంగాణలో సైతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. అయితే, పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..