భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గంగానది
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రుషికేశ్‌లో గంగానది సాధారణ నీటిమట్టాన్ని దాటి ప్రవహిస్తోంది . ప్రస్తుతం గంగానది నీటిమట్టం 338.05 మీటర్లకు చేరింది. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. వర్షాలపై ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైనిటాల్, చంపావత్, పితొరాగ్రా, చమోలీ, తెహ్రీ గర్వాల్ మరియు డెహ్రాడూన్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల […]
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రుషికేశ్‌లో గంగానది సాధారణ నీటిమట్టాన్ని దాటి ప్రవహిస్తోంది . ప్రస్తుతం గంగానది నీటిమట్టం 338.05 మీటర్లకు చేరింది. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు.
వర్షాలపై ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైనిటాల్, చంపావత్, పితొరాగ్రా, చమోలీ, తెహ్రీ గర్వాల్ మరియు డెహ్రాడూన్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా విఙ్ఞప్తి చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రక్షణ చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీచేయిస్తోంది.