Republic day: కాగితపు త్రివర్ణ పతాకాల వినియోగంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశం ఈ సంవత్సరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. గణతంత్ర దినోత్సవానికి ముందు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశం ఈ సంవత్సరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. గణతంత్ర దినోత్సవానికి ముందు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలలో ప్రజలు ఉపయోగించే కాగితంతో తయారు చేసిన జెండాలను ఈవెంట్ తర్వాత నేలపై పడవేయకుండా అత్యంత జాగ్రత్త వహించాలని సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర హోం శాఖ.
జెండా గౌరవానికి అనుగుణంగా ఇలాంటి జెండాలను ప్రైవేట్‌గా పారవేయాలని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత జాతీయ జెండా భారతదేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002లోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ అయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను (ఆదేశించింది. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971ని కూడా పాటించాలని వెల్లడించింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో పాటు శాఖలు కూడా ఈ విషయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని మరియు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలని హోం మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనల ముఖ్య కార్యదర్శులు, నిర్వాహకులతో పాటు భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు ఒక లేఖను విడుదల చేసింది.
మరోవైపు, భారత్ 75వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ హాజరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. తొలిసారిగా సరిహద్దు భద్రతా దళం మహిళా సైనిక బృందం పరేడ్‌లో పాల్గొంటోంది. గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…