AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Politics: బీహార్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజకీయ ప్రకటనలు.. అందరి దృష్టి నితీశ్ కుమార్ పైనే!

భారతీయ జనతా పార్టీలో నితీష్ కుమార్‌కు తలుపులు మూసుకుపోయాయని అమిత్ షా ఎప్పుడూ చెప్పలేదని సీఎం నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, బీహార్ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చౌదరి చెప్పడంతో బీహార్‌లో రాజకీయ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.

Bihar Politics: బీహార్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజకీయ ప్రకటనలు.. అందరి దృష్టి నితీశ్ కుమార్ పైనే!
Bihar Cm Nitish
Balaraju Goud
|

Updated on: Jan 19, 2024 | 9:08 PM

Share

బీహార్‌లో మరోసారి రాజకీయ సంచలనం జరగబోతోందా..? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మళ్లీ ఆశ్చర్యపరుస్తారా..? ఇవీ బీహార్ పొలిటికల్ కారిడార్‌లో సర్వత్రా తిరుగుతున్న ప్రశ్నలు. ప్రస్తుతం బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే కూటమిలో లుకలుకలు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే క్రమంలోనే తాజాగా పార్టీ నేతల ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తాజాగా భారతీయ జనతా పార్టీలో నితీష్ కుమార్‌కు తలుపులు మూసుకుపోయాయని అమిత్ షా ఎప్పుడూ చెప్పలేదని సీఎం నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, బీహార్ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చౌదరి చెప్పడంతో బీహార్‌లో రాజకీయ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే మేం ఎక్కడికీ వెళ్లడం లేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించవచ్చన్న ఊహగానాలు ఉపందుకున్నాయి.

మరోవైపు బీహార్ బీజేపీ నేతలు కూడా తమ ప్రకటనలతో రాజకీయ వేడి రాజేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి రావాలని నిర్ణయించుకుంటే, బీహార్ బీజేపీ ఆయనకు స్వాగతం పలుకుతుందని బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. జేడీయూ, బీజేపీ నేతల ప్రకటనలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

ఇదిలావుంటే, ఢిల్లీలో చిరాగ్ పాశ్వాన్, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ మధ్య సమావేశం జరిగింది. జనవరి 25 వరకు పాట్నాలోనే ఉండాలని జితన్ రామ్ మాంఝీ తన ఎమ్మెల్యేలను కోరారు. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగి ప్రశ్నకు సమాధానం ఇస్తూ జితన్ రామ్ మాంఝీ.. “ఏది జరిగినా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. జై బీహార్..” అంటూ సెలవిచ్చారు.

అదే సమయంలో, రాష్ట్రీయ లోక్ జనతాదళ్ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ స్పందించారు. ” రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇబ్బంది పడుతున్నారు, RJD ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. నితీష్ తన స్థానంలో లాలూ యాదవ్ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ పరిస్థితి కొనసాగుతుంది” అంటూ కామెంట్ చేయడం మరో సంచలనంగా మారింది. ఈ ఊహాగానాలను తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు

అయితే ఈ ఊహాగానాల మధ్య బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ శుక్రవారం (జనవరి 19) ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి ఒక్కటిగానే ఉంటుంది. రాజకీయ ఊహాగానాలకు ఆధారం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మహాకూటమి ఐక్యంగా కృషి చేస్తుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…