Narayanan: వరల్డ్ రికార్డు సృష్టించాడు.. చివరకు బతుకుదెరువు కోసం తిప్పలు.. ప్లూటీస్ట్ ధీన గాధ..
ఓ వ్యక్తి ఏకధాటిగా 108 గంటలు ప్లూట్ వాయించి రికార్డు సృష్టించారు. కానీ అతను బతకడం కోసం ఇప్పుడు పని చేసుకుంటున్నారు...

ఓ వ్యక్తి ఏకధాటిగా 108 గంటలు ప్లూట్ వాయించి రికార్డు సృష్టించారు. కానీ అతను బతకడం కోసం ఇప్పుడు పని చేసుకుంటున్నారు. కేరళకు చెందిన మురళీ నారాయణన్‌కు ప్లూట్ వాయించడంలో మంచి ప్రతిభ ఉంది. ఆయన 2019లో 108 గంటలపాటు వేణువు వాయించి గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కారు. అంతకుముందు ఈ రికార్డు బ్రిటన్‌కు చెందిన కేథరీన్ బ్రూకా పేరు మీద ఉంది. అతను 27 గంటల 32 నిమిషాల పాటు ప్లూచ్ వాయించారు. అయితే 108 గంటలు ప్లూట్ వాయించి రికార్డు సృష్టించిన నారాయణన్ ఇప్పుడు అతను బతకడం కోసం వడ్రంగి పని చేస్తున్నారు. ప్లూట్ వాయించడం కోసం రూ.15 లక్షలు బాకీ పడ్డానని ఆయిన తెలిపారు. ప్రస్తుతం ఆయన తాళికులంలోని పునరావాస కాలనీలో తల్లి, భార్య, ముగ్గురు పిల్లలతో చిన్న ఇంట్లో నివాసముంటున్నారు. “నేను వేణువు వాయిస్తే నా కుటుంబ ఆకలి తీరదు” అని మురళీ నారాయణన్ అన్నారు. కరోనా మహమ్మారి ఆయనకు జీవనోపాధి లేకుండా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నారాయణన్ శిష్యుడు రమేష్ అతనికి వడ్రంగి నేర్పిస్తున్నాడు.
నారాయణన్ కళామండలం క్షేమావతి, మంజు వారియర్ యొక్క నృత్య బృందాలలో సభ్యుడిగా ఉండేవాడు. అతను జర్మనీ, ఫిలిప్పీన్స్, గల్ఫ్ దేశాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మారథాన్ వేణువు వాయిద్యం కోసం సిద్ధం కావాల్సి ఉన్నందున 2018లో ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లలేకపోయానని చెప్పారు. మారథాన్ వేణు వాయింద్యం ఆగష్టు 2018లో జరగాల్సి ఉంది, కానీ అప్పుడు వరదలు వచ్చాయని తెలిపారు. 2019 లో కూడా తును ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నట్లు చెప్పారు. గిన్నిస్ రికార్డ్ కోసం రూ .15 లక్షల అప్పు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. “వ్యక్తిగతంగా నాకు మరో రూ.10 లక్షలు అప్పు ఉందిట” అని మురళి చెప్పారు. కోవిడ్ సంక్షోభం ముగిసే వరకు వేచి చూశానని చెప్పారు. ఏ పని చేయకపోతే కుటుంబం గడిచేది కష్టమని తెలుసుకుని పని చేయడానికి సిద్ధపడ్డాను. “నేను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ”అని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తను వడ్రంగి పని నెర్చుకున్నట్లు తెలిపారు. “ఒక కళాకారుడు త్వరగా ఏదైనా నేర్చుకోగలడు, కానీ అందరూ కళాకారులుగా మారడం సాధ్యం కాకపోవచ్చు” అని మురళి అన్నారు.
Read Also.. pawan kalyan: పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి.. మధ్యలో నట్టి కుమార్.. కొనసాగుతోన్న వివాదం.



