RBI: ఆ కారణంతోనే రూ.2వేలు నోట్లు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించామన్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది. 2016 లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ. 2 వేల నోట్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోవడానికి పలు కారణాలు వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించింది. 2016 లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ రూ. 2 వేల నోట్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోవడానికి పలు కారణాలు వెల్లడించింది. గత కొన్నేళ్లుగా యూపీఐ, డిజిటల్ పేమెంట్లు చేసుకోవడం వీపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది. ఒక్క 2022లోనే డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా దాదాపు రూ.14.92 లక్షల కోట్లు లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. అయితే ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగా రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకన్నామన్న ఆర్బీఐ.. ప్రజలకు నాణ్యత గల బ్యాంక్ నోట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
2017 మార్చి నాటికి ముందే రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉండేదని పేర్కొంది. అయితే 2018 మార్చి 31 నాటికి రూ.6.72 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉండగా.. 2023 మార్చి 31 కి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గిపోయినట్లు తెలిపింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి చేరిందని తెలిపింది.కరెన్సీ నోట్ల నిర్మాణాన్ని హెతుబద్ధీకరించడానికి.. అలాగే మార్కెట్ తక్కువ విలువ గల నోట్లు అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 20213-2014లో కూడా ఇలాంటి విధానాన్నే పాటించినట్లు ఆర్బీఐ చెప్పింది. 2014 జనవరిలో 2005 కు ముందు జారీ చేసిన అన్ని కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం