AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. భారత్‌తో చైనా, పాకిస్థాన్ సంబంధాలపై ఏమన్నారంటే

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ బయల్దేరిన ప్రధాని మోదీ శుక్రవారం హిరోషిమాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి జపాన్ ప్రతినిధులు, భారత దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల్ని కలుసుకున్నారు.

PM Modi: జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. భారత్‌తో చైనా, పాకిస్థాన్ సంబంధాలపై ఏమన్నారంటే
Pm Modi
Aravind B
|

Updated on: May 19, 2023 | 11:17 PM

Share

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ బయల్దేరిన ప్రధాని మోదీ శుక్రవారం హిరోషిమాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి జపాన్ ప్రతినిధులు, భారత దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ప్రవాస భారతీయుల్ని కలుసుకున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలు.. జపాన్, భారత్‌లను మరింత దగ్గర చేశాయన్నారు. అయితే ఈ జీ7 సదస్సులో గ్లోబల్ సౌత్ గొంతుకను వినిపించడంతో పాటు ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, సరఫరా గొలుసుల వంటి రంగాల్లో మార్పులు, సవాళ్లను చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జీ7 సదస్సులో భారత్ 2003 నుంచి పాల్గొంటూ వస్తుంది.

ప్రధాని మోదీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు బయల్దేరిన వేళ ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రతిష్ఠను కాపాడుకునే అంశానికి కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే చైనాతో సాధారణ సంబంధాలకు గాను సరిహద్దు ప్రాంతాల్లో శాంతిస్థాపన చాలా అవసరమని..ఆ దేశంతో తమ సంబంధాలు, పరస్పర గౌరవం, ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదంపై స్పందించిన మోదీ.. భారత్ మొదటినుంచి శాంతిస్థాపనకు వైపు నిలుస్తోందని గుర్తుచేశారు. ఆ రెండు దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని తెలిపారు. అలాగే పాకిస్థాన్‌తో కూడా సాధారణ, పొరుగు సంబంధాలను కొరుతున్నామని.. ఉగ్రవాద వాతావరణం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..