AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodya Ram Mandir: అయోధ్యలో హై అలెర్ట్.. రామాలయానికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపు..

అయోధ్యలోని శ్రీరాముడి ఆలయానికి ఉగ్ర ముప్పు ఉందని తెలుస్తోంది. బాల రామయ్య ఆలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ నుంచి ఈ ముప్పు పొంచి ఉంది. ఈ బాంబు బెదిరింపుల అనంతరం శ్రీరామ మందిరం సహా ఇతర ముఖ్యమైన సంస్థలు దగ్గర భద్రతను పెంచారు. అయోధ్యలోని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్ స్వయంగా ఆలయానికి, అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

Ayodya Ram Mandir: అయోధ్యలో హై అలెర్ట్.. రామాలయానికి ఉగ్రవాదుల బాంబు బెదిరింపు..
Ayodhya Shri Ram Temple Threat
Surya Kala
|

Updated on: Jun 14, 2024 | 8:17 PM

Share

కోట్లాది హిందువుల కల తీరుతూ అయోధ్యలో బాల రామయ్య అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత కొలువుదీరాడు. రామయ్యను కనులారా దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు పోట్టుతున్నారు. మరోవైపు భక్తులు కానుకలను పంపిస్తూనే ఉన్నారు. తాజాగా అయోధ్యలోని శ్రీరాముడి ఆలయానికి ఉగ్ర ముప్పు ఉందని తెలుస్తోంది. బాల రామయ్య ఆలయాన్ని బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ నుంచి ఈ ముప్పు పొంచి ఉంది. ఈ బాంబు బెదిరింపుల అనంతరం శ్రీరామ మందిరం సహా ఇతర ముఖ్యమైన సంస్థలు దగ్గర భద్రతను పెంచారు. అయోధ్యలోని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్ స్వయంగా ఆలయానికి, అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దీనితో పాటు మాన్యువల్, ఎలక్ట్రానిక్ నిఘాను మరింత పటిష్టం చేయాలని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్ ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ తీవ్రవాద సంస్థ బెదిరింపులపై స్పందిస్తూ అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భద్రత ఇప్పటికే పటిష్టంగా ఉందని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. అదే క్రమంలో ఈరోజు కూడా ఆలయం, విమానాశ్రయం భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. అయోధ్య ధామ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొత్తం నగరాన్ని చిన్న చిన్న పార్ట్శ్ గా విభజించామని.. ప్రతి ప్రాంతం భద్రత బాధ్యత సీనియర్ గెజిటెడ్ అధికారులకు ఇవ్వబడిందని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్ వెల్లడించారు.

ప్రతి సందు, మూలలో సీసీ కెమెరాలు

శ్రీరామ మందిర సముదాయంలో ఏర్పాటు చేసిన అన్ని సందుల్లో తగిన సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. పోలీసులతో పాటు పీఏసీ కంపెనీలకి సంబంధించిన సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు నగరంలోని అన్ని ఇతర ముఖ్యమైన సంస్థలు, ఇతర సంస్థల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రతి మూలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈ కెమెరాల సహాయంతో రియల్ టైమ్ ఇన్‌పుట్ ఉత్పత్తి చేయబడుతుందని, దీని ఆధారంగా అవసరమైన ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

రామ మందిర భద్రత కట్టుదిట్టం

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అయోధ్యలో బాంబులతో దాడి చేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ బెదిరింపు తర్వాత అయోధ్య నగరం మొత్తం హై అలర్ట్ చేయబడింది. పోలీసు అధికారులు చెప్పిన ప్రకారం అయోధ్య ఇప్పటికే దుర్భేద్యమైన కోట కంటే సురక్షితంగా మారింది. అయినప్పటికీ ఏ ఉగ్రవాద సంస్థను తేలికగా తీసుకోమని.. ముప్పును నుంచి భద్రంగా ఉంచడం కోసం కావాల్సిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా అయోధ్యలోని శ్రీరామ మందిరానికి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..