సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా
భారత కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా( సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన సురవరం సుధారకర్‌రెడ్డి అనారోగ్య పరిస్థితుల కారణంగా తన ఈ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. తన రాజీనామాను పార్టీ కేంద్ర కమిటి ఆమోదించిందని, తాను ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యదర్శివర్గ సభ్యునిగా కొనసాగుతానని సురవరం చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డి. రాజా ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. తమిళనాడుకు చెందిన రాజా.. యువజన ఉద్యమాల నుంచి క్రియాశీల […]

భారత కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా( సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన సురవరం సుధారకర్‌రెడ్డి అనారోగ్య పరిస్థితుల కారణంగా తన ఈ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. తన రాజీనామాను పార్టీ కేంద్ర కమిటి ఆమోదించిందని, తాను ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యదర్శివర్గ సభ్యునిగా కొనసాగుతానని సురవరం చెప్పారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన డి. రాజా ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. తమిళనాడుకు చెందిన రాజా.. యువజన ఉద్యమాల నుంచి క్రియాశీల కార్యకర్తగా పార్టీలో పనిచేశారు. 1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. మరోవైపు ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు.