దీపావళికి ముందే ఎయిరిండియా అమ్మేస్తారా..?

భారత్‌లో అతిపెద్ద విమానయాన రంగ సంస్ధ ఎయిరిండియా.. గత కొంతకాలంగా సంస్ధ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.50,000 కోట్ల రుణభారంతో తలమునకలైంది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో సంస్ధ తన వాటాలను విక్రయించాలని నిర్ణయించారు. అమ్మకానికి ముందే ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎయిరిండియాకు దాదాపు 10,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 2018లో ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. […]

దీపావళికి ముందే ఎయిరిండియా అమ్మేస్తారా..?
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 4:04 AM

భారత్‌లో అతిపెద్ద విమానయాన రంగ సంస్ధ ఎయిరిండియా.. గత కొంతకాలంగా సంస్ధ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.50,000 కోట్ల రుణభారంతో తలమునకలైంది. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో సంస్ధ తన వాటాలను విక్రయించాలని నిర్ణయించారు. అమ్మకానికి ముందే ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎయిరిండియాకు దాదాపు 10,000 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 2018లో ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మరోసారి సంస్ధను విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం . ఈ ప్రక్రియ దీపావళి లేదా అంతకంటే ముందే వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి అతాను చక్రవర్తీ తెలిపారు.

ఎయిరిండియా సంస్ధకు రోజుకు రూ.15 కోట్ల ఆదాయం లభిస్తోంది. మరోవైపు ప్రభుత్వం 24 శాతం వాటాను అట్టేపెట్టుకోవాలని భావించడం, అధిక రుణ భారం వల్లే వాటా విక్రయం యత్నాలు విఫలమయ్యాయని లావాదేవీ సలహాదారు ఈవై తన నివేదికలో పేర్కొంది. అయితే ఇటీవల పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్ర ఎయిరిండియాలో వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే అంతకుముందే సంస్ధలో కార్యకలాపాలను మెరుగుపరుస్తామని కూడా చెప్పారు.

మొత్తానికి భారత విమానయాన సంస్ధ ఎయిరిండియా తన వాటాలను అమ్మాకాని పెట్టడంపై మిశ్రమ స్పందన వస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయం ఉద్యోగుల భవితవ్యంపై తీవ్ర ప్రభావాన్నిచూపుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.