Himachal Pradesh: అశాస్త్రీయ కట్టడాల వల్లే హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు.. పర్యావరణ నిపుణుల ఆందోళన
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బుధవారం కొండచరియలు విరిగి పడి 13 మంది మృతి చెందగా సుమారు 30 మందికి పైగా గల్లంతయ్యారు. గాయపడిన పలువురిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థకు....
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బుధవారం కొండచరియలు విరిగి పడి 13 మంది మృతి చెందగా సుమారు 30 మందికి పైగా గల్లంతయ్యారు. గాయపడిన పలువురిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. హిమాచల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సుతో బాటు కొన్ని వాహనాలు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయాయి. వర్షాకాల సీజన్ లో ఇక్కడ ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు, పర్యావరణ వేత్తలు అంటున్నారు. చెట్ల నరికివేత, టనెల్స్ రోడ్ల నిర్మాణం, జల విద్యుత్ ప్రాజెక్టులు మొదలైనవి వీటిలో ప్రధానమైనవని వీరు పేర్కొన్నారు. గత ఏడాది వర్షాకాల సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది కొండచరియలు విరిగిపడిన ఘటనలు 116 శాతం పెరిగాయని హిమాచల్ ప్రభుత్వ డేటా తెలిపింది. ఇప్పటికే ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 36 పెద్ద ఘటనలు జరిగినట్టు ఈ డేటాలో పేర్కొంది. కిన్నౌర్ జిల్లాలోనే 3 సంఘటనలు జరిగాయని వివరించారు. ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని కులూ లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ అసెస్ మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ హెడ్ డా.జె.సి. కునియల్ వెల్లడించారు. వర్షాలు పడినప్పుడల్లా భూసామర్థ్యం తగ్గుతుందని, సొరంగాలు తవ్వకం కారణంగా భూమి బలహీనమవుతుందని ఆయన చెప్పారు.
బండరాళ్లు … కొండచరియలు విరిగి పడడం వంటివి జరుగుతాయని, చెట్ల నరికివేతతో బాటు రోడ్ల నిర్మాణం వంటి మానవ తప్పిదాలు, తరచూ భూప్రకంపనలు ఇందుకు కారణమవుతున్నట్టు ఆయన వివరించారు. హెచ్ఎంఎస్ ప్రకాష్ అనే జియాలజిస్ట్ కూడా ఆయనతో ఏకీభవించారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో భూప్రకంపనలు పెరిగాయని. వీటివల్ల కొండప్రాంతాలు బలహీనమవుతాయని ఆయన చెప్పారు. వర్షాలు తీవ్రమయ్యే కొద్దీ ఈ పరిణామాలు కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన చెప్పారు. అందువల్లే మొదట శాస్త్రీయ విధానాలను చేబట్టి నిపుణుల సలహాను తీసుకున్న పక్షంలో ఇలాంటి ఉత్పాతాలను కొంతవరకైనా నివారించగలుగుతామన్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులను ఇబ్బడిముబ్బడిగా నిర్మించడాన్ని కూడా వారు ప్రస్తావించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : హరీష్ రావు ఎంట్రీతో మరింత వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం..హోరెతించిన గులాబీ.:Huzurabad Politics Live Video.
బుర్జ్ ఖలీఫా హోటల్ పై మహిళ…ఇదెక్కడి యాడ్ రా మావా..!వీడియో వైరల్..:woman on Burj Khalifa Video.