Liquor Ban: మద్య నిషేధంపై ఓటింగ్‌.. రెండు పంచాయతీల్లో మద్యం అమ్మకాల బంద్‌కు నిర్ణయం..!

Liquor Ban: మద్యానికి బానిసైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా మద్యానికి అలవాటు పడి కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతుండటంతో మహిళలు ..

Liquor Ban: మద్య నిషేధంపై ఓటింగ్‌.. రెండు పంచాయతీల్లో మద్యం అమ్మకాల బంద్‌కు నిర్ణయం..!
Liquor Ban
Follow us

|

Updated on: Nov 14, 2021 | 7:55 PM

Liquor Ban: మద్యానికి బానిసైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా మద్యానికి అలవాటు పడి కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతుండటంతో మహిళలు రోడ్డెక్కుతు మద్యాన్ని నిషేధించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని రెండు పంచాయతీలు మద్య నిషేధానికి ఓటు వేశారు. రాజ్‌సమంద్‌ జిల్లాలో బరార్‌, వీర్‌ అనే రెండు పంచాయతీలు శనివారం గ్రామంలో మద్యం దుకాణాలను తొలగించాలని అధిక సంఖ్యలో ఓటు వేశారు. 2015 నుంచి గ్రామ మహిళల ఉద్యమం తర్వాత రాజస్థాన్‌ ఎక్సైజ్‌ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ కింద మద్యం షాపుల తొలగింపు కోసం ఓటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే ఈ ఓటింగ్‌లో 64 శాతం మహిళలు మద్యం దుకాణాలను మూసివేయాలని ఓటు వేయడంతో మద్య నిషేధం ఖరారైంది.

సాయంత్రం మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గుంపులు గుంపులుగా రావడంతో రెండు పంచాయతీల్లోనూ అసెంబ్లీ ఎన్నికలాగా ఉత్సాహం నెలకొంది. బరార్‌ మహిళా సర్పంచ్‌ పంకజా సింగ్‌, మహిళల బృందంతో కలిసి రోజంతా మహిళలను ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు. గ్రామంలోని పురుషులు అధిక సంఖ్యలో మద్యానికి బానిస కావడంతో ప్రతి ఇంట్లో మహిళలు, పిల్లలు గృహ హింసకు గురవుతున్నారని, మద్యానికి డబ్బులు చెల్లించడానికి పురుషులు ఇంట్లో ఉన్న భార్యల బంగారు అభరణాలను తాకట్టు పెట్టడం, అమ్మివేయడం, అలాగే ఇంట్లో ఉన్న ఇతర వస్తువులను అమ్ముతూ మద్యానికి బానిస అవుతున్నారని పంకజాసింగ్‌ అన్నారు.

అయితే ఈ ఓటింగ్‌ నిర్వహించేందుకు షరతులు కూడా విధించారు. 20 శాతం ఓటర్లు సంతకాలు చేయడంతో ఓటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంతో మంది మద్యానికి బానిసై మహిళలకు హింసిస్తున్నారని, మద్యం మానేయాలని ఎన్ని విధాలుగా చెప్పినా.. వారు పెడచెవిన పెడుతున్నారని, అందుకే అధికారుల సహాయంతో ఇలా ఓటింగ్‌ ద్వారా మద్య నిషేధానికి లైన్‌ క్లియర్‌ అయ్యిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే ప్రయాణికులు అలర్ట్‌.. ఆ సమయాల్లో నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్‌ సిస్టమ్‌ సేవలు

PM Fasal Bima Yojana: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు పెరిగినా.. బెనిఫిట్ పొందిన రైతుల సంఖ్య తగ్గింది..!