PM Fasal Bima Yojana: కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకంలో దరఖాస్తులు పెరిగినా.. బెనిఫిట్ పొందిన రైతుల సంఖ్య తగ్గింది..!
PM Fasal Bima Yojana: కేంద్ర రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన్ మంత్రి ఫసర్ బీమా యోజన ఒకటి. దీని కింద దరఖాస్తు చేసుకున్న రైతుల సంఖ్య ఖరీఫ్ సీజన్ 2018తో పోలిస్తే 2021లో దాదాపు 30 శాతం తగ్గినట్లు..
PM Fasal Bima Yojana: కేంద్ర రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక ప్రవేశపెట్టిన పథకాలలో ప్రధాన్ మంత్రి ఫసర్ బీమా యోజన ఒకటి. దీని కింద దరఖాస్తు చేసుకున్న రైతుల సంఖ్య ఖరీఫ్ సీజన్ 2018తో పోలిస్తే 2021లో దాదాపు 30 శాతం తగ్గినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2018 ఖరీఫ్ సీజన్‌లో 2.16 కోట్ల మంది రైతులు పీఎం ఫసల్ బీమా యోజన కింద నమోదు చేసుకున్నారు. 2021 ఖరీఫ్ సీజన్‌లో 1.50 కోట్లకు తగ్గింది. అయినప్పటికీ దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా 2018 నుంచి 2021 ఖరీఫ్ సీజన్‌లో ఈ స్కీమ్ కింద నమోదు చేసుకున్న రైతుల సంఖ్య సుమారు 30 శాతం తగ్గింది. 2020లో 1.67 కోట్ల మంది రైతులు ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో 2018 రబీ సీజన్‌లో1.46 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్‌లో నమోదు చేసుకోగా,2019లో 96.60 లక్షల మంది రైతులు, రబీ సీజన్ 2020లో 99.95 లక్షల మంది రైతులు ఈ స్కీమ్‌లో చేరారు.
2016-17లో ప్రధాన మంత్రి ఫసర్ బీమా యోజన స్కీమ్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకం ద్వారా కార్యాచరణ మార్గదర్శకాలు రబీ సీజన్ 2018, ఖరీఫ్ సీజన్ 2020లో సవరించబడ్డాయి. అక్టోబర్ 21, 2021 నాటి డేటా ప్రకారం.. ప్రధాన మంత్రి ఫసర్ బీమా యోజన కింద 2018 ఖరీఫ్ సీజన్‌లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి 2.04 కోట్ల దరఖాస్తులు, రుణాలు తీసుకోని రైతుల నుంచి 1.15 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. 2019 ఖరీఫ్ సీజన్‌లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి 2.38 కోట్ల దరఖాస్తులు , రుణాలు తీసుకోని రైతుల నుంచి 1.68 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. 2020లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి 2.68 కోట్ల దరఖాస్తులు, రుణం తీసుకోని రైతుల నుంచి 1.42 కోట్ల దరఖాస్తులు రాగా, 2021ఖరీఫ్ సీజన్‌లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి 3.74 కోట్ల దరఖాస్తులు రాగా, 1.23 కోట్ల దరఖాస్తులు రుణాలు తీసుకోని వారి నుంచి వచ్చాయి. రుణం తీసుకోని రైతుల నుంచి 2018 రబీ సీజన్‌లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి 1.33 కోట్ల దరఖాస్తులు రాగా, 2019 రబీ సీజన్‌లో 1.31 కోట్లు, 2020లో 1.23 కోట్ల దరఖాస్తులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, ఈ స్కీమ్ 2018లో 22 రాష్ట్రాల్లోని 475 జిల్లాల్లో అమలు చేయబడింది. ఖరీఫ్ సీజన్ 2021 లో ఈ స్కీమ్ దేశంలో 19 రాష్ట్రాల్లోని 404 జిల్లాలకు వర్తింపజేసింది కేంద్ర ప్రభుత్వం. 2020 రబీ సీజన్‌లో దేశంలోని 18 రాష్ట్రాల్లోని 389 జిల్లాల్లో ఈ పథకం వర్తింపజేశారు. ఈ బీమాపై ఆగస్టులో పార్లమెంట్‌లో సమర్పించిన వ్యవసాయ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ మరియు జార్ఖండ్ ప్రభుత్వాలను ఉపసంహరించుకోవడానికి లేదా అమలు చేయకపోవడానికి గల కారణాలను అడిగింది. పథకంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదికలో, క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం ఆమోదయోగ్యం కాదని కమిటీ పేర్కొంది. పథకాన్ని మరింత సాంకేతికత ఆధారితంగా చేయాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది.
ఇవి కూడా చదవండి: