Home Loan Charges: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయో గమనించండి

Home Loan Charges: హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి బ్యాంకులు ఎన్నో ఆఫర్లు కల్పిస్తున్నాయి. హోమ్‌ లోన్‌ తీసుకున్న తర్వాత వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే హోమ్‌ లోన్‌పై వివిధ రకాల ఛార్జీలు కూడా ఉంటాయి. ఆ ఛార్జీలు..

Home Loan Charges: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఎలాంటి ఛార్జీలు ఉంటాయో గమనించండి
Follow us
Subhash Goud

|

Updated on: Nov 14, 2021 | 4:25 PM

Home Loan Charges: హోమ్‌ లోన్‌ తీసుకునేవారికి బ్యాంకులు ఎన్నో ఆఫర్లు కల్పిస్తున్నాయి. హోమ్‌ లోన్‌ తీసుకున్న తర్వాత వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే హోమ్‌ లోన్‌పై వివిధ రకాల ఛార్జీలు కూడా ఉంటాయి. ఆ ఛార్జీలు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని బ్యాంకులు హోమ్‌లోన్‌పై విడివిడిగా ఛార్జీలు వసూలు చేస్తుంటే.. మరి కొన్ని బ్యాంకులు చెల్లించే ఈఎంఐలోనే ఉంటాయి. అయితే గృహ రుణం కోసం తీసుకునే రుణాలలో ఎలాంటి ఛార్జీలు ఉంటాయో తెలుసుకుందాం.

దరఖాస్తు రుసుము: హోమ్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో రుణదాత నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. లోన్‌ ప్రాసెసింగ్‌ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో పాటు అప్లికేషన్‌లో పూర్తి వివరాలు ఉన్నాయో లేదో బ్యాంకు అధికారులు పరిశీలిస్తారు.

ప్రాసెసింగ్‌ ఫీజు: రుణం కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులు లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఇందులో కేవైసీ ధృవీకరణ, ఆర్థిక పరిస్థితులు, ఉపాధి ధృవీకరణ, నివాసం, చిరునామా ధృవీకరణ, క్రెడిట్‌ చరిత్రలు ఉంటాయి. ఇందులోనే ప్రాసెసింగ్‌ ఫీజులను వసూలు చేస్తాయి బ్యాంకులు. సాధారణంగా లోన్‌ మొత్తంలో 2 శాతం వరకు వేరియబుల్‌ ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తారు. ఉదాహరణకు .. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. రూ.50 లక్షల వరకు రుణం కోసం రూ.10వేల వరకు ఫీజును వసూలు చేస్తారు. రూ.50 లక్షల కంటే ఎక్కువ రుణానికి రూ.15 వేల వరకు వసూలు చేస్తారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ అయితే లోన్‌ మొత్తంలో 0.5 శాతం ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేస్తుంది. గరిష్టంగా రూ.3000 ఉంటుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు లోన్‌ మొత్తంలో 0.50-2 శాతం ప్రాసెసింగ్‌ ఫీజు లేదా రూ.1500 వర్తించే జీఎస్టీతో ఏది ఎక్కువైతే అది వసూలు చేస్తుంది.

సాంకేతిక నిపుణుల అంచనా రుసుము: గృహ రుణం తీసుకునే వారి యొక్క ఆస్తి మార్కెట్‌ విలువ అంచనా వేయడానికి రుణదాతలు సాంకేతిక నిపుణులను నియమిస్తారు. ఈ నిపుణులు చట్టబద్దమైన ఆమోదం, లేఅవుట్‌ ఆమోదం, బిల్డింగ్‌ స్పెసిఫికేషన్‌లు, నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా ఉండడం మొదలైన వాటిపై ఆస్తిని అంచనా వేస్తారు. వారు భూమి ధర, నిర్మాణ వ్యయంతో సహా వివిధ మార్గాల ద్వారా ఆస్తిని మార్కెట్‌ విలువను కూడా నిర్ణయిస్తారు. చాలా మంది రుణదాతలు తమ ప్రాసెసింగ్‌ ఫీజులో ఈ ఛార్జీని కలిగి ఉండగా, కొందరు రుణదాతలు దీనిని విడిగా వసూలు చేస్తారు.

తనఖా పెట్టే ఆస్తిపై పరిశీలన కోసం రుసుము: రుణదాత కోసం వారు ఫైనాన్సింగ్‌ కోసం తనఖా పెట్టిన ఆస్తికి ఎటువంటి వివాదాలు ఉండకూడదనే విషయాన్ని నిర్ధారించడం ఎంతో ముఖ్యం. ఈ విషయాలను న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలన తదితర వివరాలను పరిశీలిస్తారు. ఇందు కోసం బ్యాంకులు కొంత ఫీజును వసూలు చేస్తాయి.

ఫ్రాంకింగ్‌ ఫీజు: ఫ్రాంకింగ్‌ ఫీజు అనేది హోమ్‌ లోన్‌ ఒప్పందాన్ని సాధారణంగా మెషిన్‌ ద్వారా స్టాంప్‌ చేసే ప్రక్రియ. తద్వారా మీరు అవసరమైన స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు చేసినట్లు నిర్ధారిస్తారు. హోమ్‌ లోన్‌ అగ్రిమెంట్‌ ఫ్రాంకింగ్‌ సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వంచే అధికారం పొందిన ఏజెన్సీలచే నిర్వహించబడుతుంది. ఈ ఛార్జీ భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వసూలు చేస్తారు. ఫ్రాంకింగ్‌ ఛార్జీలు సాధారణంగా హోమ్‌ లోన్‌ విలువలో 0.1 శాతం ఉంటుంది.

ప్రీ-ఈఎంఐ ఛార్జీ: గృహ రుణం ఇచ్చిన తర్వాత రుణగ్రహీత ఇంటిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం జరిగితే రుణగ్రహీత ఇంటిని స్వాధీనం చేసుకునే వరకు ప్రీ-ఈఎంఐ అనే సాధారణ వడ్డీని రుణదాతలు వసూలు చేస్తాయి.

రెగ్యులేటరీ ఛార్జీలు: గృహ రుణం పొందే ప్రక్రియలో చట్టబద్దమైన సంస్థల తరపున రుణదాత వసూలు చేసే ఛార్జీలు ఇవి. ఇది ఎక్కువగా స్టాంప్‌ డ్యూటీ, జీఎస్టీ రూపంలో వివిధ ఛార్జీలపై రుణదాత వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించబడుతుంది.

బీమా ప్రీమియం: చాలా రుణదాతలు రుణగ్రహీతలను బీమా చేసుకోవాలని కోరుతుంటాయి. ఏదైనా నష్టం జరిగిన సమయంలో బీమా వర్తిస్తుందని సూచిస్తుంటాయి బ్యాంకులు.కొంత మంది జీవిత బీమా కోసం పాలసీ తీసుకోవాలని సూచిస్తుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో రుణం చెల్లించే విషయంలో ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి సమయంలో గృహ రుణంతో పాటు బీమా పాలసీని పొందాలని నిర్ణయించుకుంటే బీమా ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

నోటరీ రుసుము: మీరు హోమ్‌ లోన్‌ పొందేందుకు ఎన్‌ఆర్‌ఐ అయితే మీరు కొన్ని అదనపు పని చేయాల్సి ఉంటుంది. మీ కేవైసీ పత్రాలు, పీఓఏ (పవర్‌ ఆఫ్‌ అటార్నీ) భారతీయ రాయబారి కార్యాలయం లేదా విదేశాలలో అందుబాటులో ఉన్న స్థానిక నోటరీ ద్వారా నోటరీ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కొంత రుసుము వసూలు చేస్తాయి రుణాలు ఇచ్చే సంస్థలు.

ఇవి కూడా చదవండి:

PM Kisan Yojana: కేంద్రం అదిరిపోయే స్కీమ్‌.. ఆ రూ.2 వేలతో పాటు రూ.3 వేల నెలవారీ పెన్షన్‌ కూడా పొందవచ్చు.. ఎలాగంటే

RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!