Tech Tips: వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయలేకపోతున్నారా.. అయితే, ఇలా ట్రై చేయండి.. వెరీ సింపుల్!

ఇటీవల విడుదలైన దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది. దీంతో వినియోగదారులు కూడా బాగానే లబ్ధి పొందుతున్నారు. అయితే, వాట్సాప్‌కు కాల్ చేస్తున్న సమయంలో మనం రికార్డ్ చేయలేము

Tech Tips: వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయలేకపోతున్నారా.. అయితే, ఇలా ట్రై చేయండి.. వెరీ సింపుల్!
Whatsapp
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 14, 2021 | 3:34 PM

Tech Tips for WhatsApp Users: ఇటీవల విడుదలైన దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది. దీంతో వినియోగదారులు కూడా బాగానే లబ్ధి పొందుతున్నారు. అయితే, వాట్సాప్‌కు కాల్ చేస్తున్న సమయంలో మనం రికార్డ్ చేయలేము. వాట్సాప్‌లో ప్రతి నెలా 100 బిలియన్ల సందేశాలు ప్రసారం అవుతున్నాయి. రోజుకు 100 కోట్లకు పైగా కాల్స్ వస్తున్నాయి. అయితే, వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయడానికి ఎటువంటి ఫీచర్లు అందుబాటులో లేవు. దీంతో చాలామంది యూజర్లు నిరాశకు గురయ్యారు. ఇదిగో పరిష్కారం.. వేరే ట్రిక్‌ని ఉపయోగించి వాట్సాప్ కాల్ రికార్డర్‌ని చేయడానికి కొత్త అప్షన్ తీసుకువచ్చింది.

సాధారణంగా వాట్సాప్ కాల్ వస్తే స్పీకర్ ఆన్ చేసి మరో మొబైల్ ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. అయితే దీనికి రెండు స్మార్ట్‌ఫోన్‌లు అవసరం. లేదంటే థర్డ్ పార్టీ యాప్‌లలో ఒకటైన “వాయిస్ రికార్డర్”ని ఉపయోగించవచ్చు. Otter.Ai యాప్ వాయిస్ రికార్డింగ్ కోసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రికార్డ్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా WhatsApp కాల్‌లను రికార్డ్ చేయనుంది. వాయిస్ కాల్స్ టెక్స్ట్ ఫార్మాట్ లోకి మార్చడం ఈ యాప్ ప్రత్యేకత. దీని ద్వారా ప్రతి నెలా 600 నిమిషాల కాల్స్ ఉచితంగా రికార్డ్ చేసుకోవచ్చు.

అదనంగా, గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక వాయిస్ కాల్ రికార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. “రికార్డ్ WhatsApp కాల్” ఉత్తమంగా ఉపయోగించబడుతుంది. ఇది వాట్సాప్ కాల్‌లను ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయడమే కాకుండా, గూగుల్ డ్రైవ్‌కు అప్‌లోడ్ చేస్తుంది.

వాట్సాప్‌లో వీడియో కాల్‌ని వాయిస్ కాల్‌గా కూడా రికార్డ్ చేయవచ్చు. మీకు థర్డ్ పార్టీ యాప్ అవసరం. DU రికార్డర్ యాప్ సులభమైన.. మంచి స్క్రీన్ రికార్డర్ ఆప్. ఈ యాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీ.. స్క్రీన్‌పై ఫ్లోటింగ్ ఐకాన్ ద్వారా స్క్రీన్‌పై రికార్డ్ చేయవచ్చు. ఫ్లోటింగ్ ఐకాన్ మీకు విభిన్న ఎంపికలను అందిస్తుంది. మీరు స్క్రీన్ రికార్డ్‌ను ఇక్కడ ప్రారంభించవచ్చు లేదా ఆపవచ్చు. అలాగే, వీడియో శబ్దం అయితే, DU రికార్డర్ దానిని రికార్డ్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా వీడియో కాలింగ్‌ను రికార్డ్ చేయడం ఉత్తమం.

అయితే, మార్కెట్లలో అందుబాటులో ఉన్న అన్ని యాప్‌ల ద్వారా కాకుండా నమ్మకమైన, నిపుణుల సూచనల మేరకు మాత్రమే వాడాలని సైబర్ ఎక్స్‌ఫర్ట్స్ చెబుతున్నారు.

Read Also… Mobile Data Plans: 1జీబీ డేటా రూ.38,000.. ఎక్కడో తెలుసా? నివేదికలో నమ్మలేని నిజాలు..!