AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Data Plans: 1జీబీ డేటా రూ.38,000.. ఎక్కడో తెలుసా? నివేదికలో నమ్మలేని నిజాలు..!

Mobile Data Plans: భారతదేశంలోని ప్రజలు ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లపై గడుపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.

Mobile Data Plans: 1జీబీ డేటా రూ.38,000.. ఎక్కడో తెలుసా? నివేదికలో నమ్మలేని నిజాలు..!
Venkata Chari
|

Updated on: Nov 14, 2021 | 3:29 PM

Share

Mobile Data Plans: భారతదేశంలోని ప్రజలు ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లపై గడుపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. మొబైల్ యాప్ అనలిస్ట్ కంపెనీ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఇండోనేషియాలో ప్రజలు 5.5 గంటలతో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే బ్రెజిల్ 5.4 గంటలతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా 5 గంటలతో మూడో స్థానం, భారత్ 4.8 గంటలతో నాలుగో స్థానంలో, మెక్సికో 4.8 గంటలతో ఐదో స్థానంలో నిలిచాయి.

డేటాను పరిశీలిస్తే, భారత దేశంలో వినియోగదారులు ప్రతిరోజూ 24 గంటలలో 4.8 గంటలు మొబైల్‌లో గడుపుతున్నట్లు స్పష్టమవుతోంది. గతేడాది తొలి త్రైమాసికంలో ఈ సమయంలో ప్రజలు 4 గంటలపాటు ఫొన్లు వాడుతున్నట్లు. దీంట్లో ఎక్కువ మంది వినియోగదారులు గేమింగ్‌లో బిజీగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాడు. ఇది కాకుండా, ఫిన్‌టెక్, క్రిప్టో యాప్‌లు కూడా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఈ నివేదికలో వెల్లడైంది.

2021 మూడవ త్రైమాసికానికి సంబంధించిన నివేదికను ఈ నివేదిక విడుదల చేసింది. యాప్‌ల డౌన్‌లోడ్‌లో 28% పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. మొత్తం యాప్‌ల డౌన్‌లోడ్‌లో కూడా 28% పెరుగుదల ఉందని వెల్లడించింది. ఆ తర్వాత డౌన్‌లోడ్‌ల విషయానికి వస్తే మొత్తం యాప్‌ల సంఖ్య 24 వేల కోట్లకు చేరుకుంది. నివేదిక ప్రకారం, మొబైల్ గేమింగ్ పరంగా భారతదేశం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. ప్రతి ఐదులో ఓ మొబైల్ గేమ్ యాప్ భారతదేశంలో డౌన్‌లోడ్ అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ప్రపంచంలోనే చౌకైన ఇంటర్నెట్ డేటా.. ప్రపంచంలోనే చౌకైన ఇంటర్నెట్ డేటా కేవలం భారత్‌లోనే లభిస్తుంది. అందుకే ఇక్కడ మొబైల్ ఫోన్లతోపాటు, యాప్‌ల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే డేటా విషయంలో అత్యంత ఖరీదైన దేశంగా ఆఫ్రికన్‌లోని సెయింట్ హెలెనా నిలిచింది. భారతదేశంలో 1GB డేటా సగటు ధర రూ. 7 అయితే.. సెయింట్ హెలెనాలో దీని ధర రూ. 38,000. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో దీని ధర 7 రెట్లు ఎక్కువగా ఉంది.

Also Read: New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!

Xiaomi Bumper Offer: కస్టమర్లకు షావొమి బంపర్ ఆఫర్.. స్మార్ట్ వాచ్‌పై భారీగా ధర తగ్గింపు.. రేట్ల వివరాలివే..