Rajasthan: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గమంతా రాజీనామా.. రేపు కేబినెట్ విస్తరణ..!
Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు...

Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. రాజస్థాన్ కేబినెట్‌లో ప్రస్తుతం ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి మంత్రివర్గ జాబితాను పంపనుంది. రాజస్థాన్ గవర్నర్ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:




