హృదయవిదాకర ఘటన.. 6 నెలల పసికందుతో సహా మొత్తం కుటుంబం దహనం
రాజస్థాన్‌లో హోర ఘటన జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను వారి ఇంట్లోనే ఉంచి ఇల్లు మొత్తం తగలబెట్టారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా..

జోధ్‌పూర్, జులై 20: రాజస్థాన్‌లో హోర ఘటన జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను వారి ఇంట్లోనే ఉంచి ఇల్లు మొత్తం తగలబెట్టారు. మృతుల్లో ఆరు నెలల పసికందు కూడా ఉంది. ఆ దారుణ ఘటన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సొంత జిల్లాలో చోటుచేసుకోవడంతో రాజకీయంగా తీవ్రదుమారం లేపింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ వర్గాలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ దారుణ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయి నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను పునారామ్ (55), భావ్రీ దేవి (50), దాపు (మేనకోడలు)లుగా గుర్తించారు. ఇంటి ప్రాంగణంలో మరో హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఒక మృతదేహం పక్కన నల్లటి బూడిద ముద్ద కనిపించింది. మృతురాలి కుమార్తె ఆరు నెలల పసికందుగా గుర్తించారు. కుటుంబంలోని అందరినీ మొదట గొంతు కోసి, తర్వాత ఇంటిని తగలబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలకు కారణం ఏమై ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షల వల్ల హత్యలు జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




जोधपुर जो मुख्यमंत्री जी का गृह जिला है, वहां 3 दिन पहले एक महिला के साथ गैंगरेप हुआ, वो अपनी सुरक्षा के लिए इधर उधर दौड़ती रही। लेकिन मुख्यमंत्री जी उसे cover up करने के लिए कहते हैं कि ये तो किसी और विचारधारा के लोग हैं। – श्री @arjunrammeghwal , केंद्रीय मंत्री pic.twitter.com/f0Ytk7tXJj
— BJP Rajasthan (@BJP4Rajasthan) July 19, 2023
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలకు దిగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర పరిష్టితి ఇంకేలా ఉందో చెప్పనవసరం లేదని, శాంతి భద్రతలు ఎప్పుడో మంట కలిసిపోయాయని ఘాటు విమర్శలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




