AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Mine: భారత్‌లో బయటపడ్డ మరో బంగారు గని.. కుప్పలు తెప్పలుగా కనిపించిన నిల్వలు.. ఎక్కడో తెలుసా?

దేశంలో మరో కొత్త బంగారు గని బయటపడింది. రాజస్థాన్‌లోని బాన్స్‌వాడ జిల్లాలో 3వ బంగారు గనిని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ గనిలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Mine: భారత్‌లో బయటపడ్డ మరో బంగారు గని.. కుప్పలు తెప్పలుగా కనిపించిన నిల్వలు.. ఎక్కడో తెలుసా?
Gold Mine
Anand T
|

Updated on: Oct 23, 2025 | 1:48 PM

Share

భారత్‌లోని బంగారు గనులు అనే ప్రస్థావన వస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మొదటి పేరు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కానీ ఇప్పుడు ఈ పేరు వెనక్కి దొబ్బి మరో రాష్ట్రం పేరు తెరపైకి వస్తోంది. అవును, మన దేశంలోని ఒక రాష్ట్రంలో భారీగా బంగారు గనులు, నిల్వలు బయటపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రెండు గనులు ఉండగా తాజాగా మరో బంగారు గని బయటపడింది. అదే రాజస్థాన్‌లోని బాన్స్‌వాడ జిల్లాలో ఇటీవల బయటపడిన 3వ బంగారు గని. బాన్స్‌వాడ జిల్లాలోని ఘటోల్ – కంకారియా గ్రామంలో 3వ బంగారు గని గుర్తించారు భూగర్బ శాస్త్రవేత్తలు.

బాన్స్‌వాడ జిల్లాలోని ఘటోల్ – కంకారియా గ్రామంలో బయటపడిన ఈ గనిలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే ఖనిజం వెలికితీత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపటనున్నారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం, 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో 113.52 మిలియన్ టన్నులు బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం 222.39 టన్నుల బంగారు లోహం లభించవచ్చని.. కంకారియా-గారా ప్రాంతంలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ గనిలో బంగారంతో పాటు, అనేక ఇతర సహ-ఖనిజాలు కూడా వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..