AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Elections: వీడిన సస్పెన్స్.. మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరు ఖరారు

బిహార్ రాజకీయాల్లో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్( RJD) నేత తేజస్వీ యాదవ్ పేరును మహకూటమి అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాట్నాలో జరిగిన కూటమి సంయుక్త మీడియా సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది.

Bihar Elections: వీడిన సస్పెన్స్.. మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ పేరు ఖరారు
Tejashwi Yadav
Anand T
|

Updated on: Oct 23, 2025 | 4:07 PM

Share

బిహార్ రాజకీయాల్లో గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు సీట్ల పంపకాలపై వారాల తరబడి విస్తృత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ గురువారం అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్‌, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీని పేర్లను మహాకూటమి ప్రకటించింది. పాట్నాలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.

ఈ సమావేశం సందర్భంగా అందరం కలిసి ఐక్య ముఖాన్ని ప్రదర్శిస్తూ, ఎన్నికలలో సమిష్టిగా పోరాడాలనే తమ ప్రణాళినకు మహాఘట్‌బంధన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన నాయకులు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల పోటీని ‘ప్రజాస్వామ్యం, నిరంకుశ శక్తుల మధ్య యుద్ధం’గా అభివర్ణించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తరపున రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నాయకుడు పవన్ ఖేరా పాల్గొన్నారు. ఎన్నికల ఫలితం మహా కూటమికి అనుకూలంగా ఉంటే, రాష్ట్రంలో కొత్త సామాజిక వాస్తవికతకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.

మహాకూటమికి తేజస్వి యాదవ్ ధన్యవాదాలు

ఇదిలా ఉండగా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై మహా కూటమి అగ్రనేతలకు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ ధన్యవాదాలు తెలిపారు. మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు సోనియాగాంధీకి ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కి ధన్యవాదాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ ని పునర్నిర్మిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో అవినీతి పేరుకుపోయిందని.. డబల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం, కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఎన్ డీఏ ప్రభుత్వం ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఎందుకు ప్రకటించలేదు.. ఎందుకు నితీష్ కుమార్ పేరుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని ప్రశ్నించారు.

20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అమిత్ షా విధానసభ సభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారని అన్నారు..గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ను ప్రకటించారు. ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదని ఆయన అన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదని జోశ్యం చెప్పారు.

అశోక్ గెహ్లాట్: బీహార్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు

తేజస్వి యాదవ్‌ పేరును ప్రకటించడంపై బీహార్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు అశోక్ గేహ్లాట్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. మీరి ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు.. కానీ తరువాత ముఖ్యమంత్రిని మార్చారని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్